Home » TRS
తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. ఓటరు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లోనూ 14 సీట్లు గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది.
బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవాన్ని పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశించారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో ఎండిన పంటలకు మద్దతుగా రైతుల మహా ధర్నాలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అవేంటంటే.. బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మారుస్తామని ప్రకటించారు.
మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తోపాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బరిలో దిగడం లేదని సదరు సర్కిల్లో ఓ చర్చ అయితే వాడి వేడిగా వైరల్ అవుతోంది.
బళ్ళు ఓడలవుతాయి.. ఓడలు బళ్ళవుతాయి అంటే ఇదేనేమో.. తెలంగాణ ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తుంది. బీఆర్ఎస్ టికెట్ల కోసం విపరీతమైన పోటీ.. టికెట్ కోసం పైరవీలు.. బల నిరూపణలు.. అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు.. ఒక టికెట్ కోసం పది, ఇరవై మంది పోటీ.. ఇది ఒకప్పటి బీఆర్ఎస్ పరిస్థితి.
తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రికి పీఠాన్ని అందించిన కారు జోరుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో హస్తం బ్రేకులు వేసింది.
హైదరాబాద్ విమోచన దినానికి, 2023 డిసెంబర్ 3వ తేదీకి ఒకే చరిత్ర ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. 7 తరలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి లభించిందని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.
తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిని అందించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వరస చిక్కుల్లో ఇరుక్కుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 సీట్లు మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది.
గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనపై బీఆర్ఎస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. రేవంత్ ప్రభుత్వం కారణంగానే గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
BRS Chief KCR National Politics: జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండాలని గులాబీ బాస్ కేసీఆర్ (KCR) భావిస్తున్నారా..? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సారుకు తెలిసొచ్చింది ఇదేనా..? ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని బీఆర్ఎస్ చీఫ్ ఫిక్స్ అయ్యారా..? పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమా..? అంటే తాజా పరిణామాలు చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది..