Share News

విజయవాడలో డ్రగ్స్ వినియోగదారులపై పోలీసుల పంజా.. పలువురి అరెస్ట్

ABN , Publish Date - Oct 08 , 2026 | 08:48 AM

విజయవాడలో డ్రగ్స్ వినియోగదారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నగరంలోని పలు రెసిడెన్సీలపై తనిఖీలు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు..

విజయవాడలో డ్రగ్స్ వినియోగదారులపై పోలీసుల పంజా.. పలువురి అరెస్ట్
vijayawada police drug raids

విజయవాడ, అక్టోబర్ 8: నగరంలో డ్రగ్స్ వినియోగదారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. పలు రెసిడెన్సీలపై తనిఖీలు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు.


విజయవాడ నగరంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న డ్రగ్స్ వినియోగంపై పోలీసులు పంజా విసిరారు. ఈగల్, లోకల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా.. పలు రెసిడెన్సీలలో సోదాలు నిర్వహించి, పలువురిని అరెస్ట్ చేశారు. సత్యనారాయణపురం పోలీసు‌స్టేషన్ పరిధిలోని విజయేశ్వరి రెసిడెన్సీ, రైల్వే‌స్టేషన్ సమీపంలోని రెసిడెన్సీలో పోలీసులు అనుమానాస్పద తనిఖీలు నిర్వహించారు. ఇందులో 12 మందికి డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ చేయగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిని స్టేషన్‌కు తరలించిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెలాఖరులో జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌18 ప్రయోగం

తిరుమల సకల సమాచారంతో ‘గరుడ మ్యాప్‌’

Read Latest Telangana News And AP News

Updated Date - Oct 08 , 2026 | 09:04 AM