Share News

తిరుమల సకల సమాచారంతో ‘గరుడ మ్యాప్‌’

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:08 AM

తిరుమలకు వచ్చే భక్తులు ఎవరి సహాయం లేకుండా, వెళ్లాల్సిన ప్రాంతానికి సులువుగా చేరుకునేలా ‘గరుడ మ్యాప్‌’ పేరిట టీటీడీ ఓ యాప్‌ను రూపొందించింది.

తిరుమల సకల సమాచారంతో ‘గరుడ మ్యాప్‌’
Tirumala Garuda Map app

తిరుమల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): తిరుమలకు వచ్చే భక్తులు ఎవరి సహాయం లేకుండా, వెళ్లాల్సిన ప్రాంతానికి సులువుగా చేరుకునేలా ‘గరుడ మ్యాప్‌’ పేరిట టీటీడీ ఓ యాప్‌ను రూపొందించింది. తిరుమల క్షేత్రానికి సంబంధించిన సకల సమాచారంతో ప్రత్యేకంగా ఈ యాప్‌ను రూపొందించారు. భక్తుడు ఏ ప్రాంతానికి వెళ్లాలనుకున్నా యాప్‌లో ఆ ప్రదేశం పేరు నమోదు లేదా వాయిస్‌ కమాండ్‌ ఇస్తే ఆ ప్రాంతానికి తేలికగా చేరుకోవచ్చు.


ఉదాహరణకు భక్తులు తలనీలాలు ఇవ్వాలనుకుంటే యాప్‌లో నమోదు చేసిన వెంటనే తిరుమలలో ఉన్న కల్యాణకట్టలన్నీ యాప్‌లో కనిపిస్తాయి. అక్కడికి చేరుకునే మార్గాలన్నీ డిస్‌ప్లే అవుతాయి. నడిచి వెళితే ఎంత దూరం, వాహనంలో వెళితే ఎంత దూరం, చేరుకోవడానికి పట్టే సమయం కూడా కనిపిస్తుంది. అంతేకాదు తక్షణమే సులువుగా చేరుకునే మార్గాన్ని కూడా సూచిస్తుంది. ఇలా వివిధ రకాల దర్శనాల ప్రవేశాలు, క్యూకాంప్లెక్స్‌లు, లడ్డూ కేంద్రం, అతిథిగృహాలు, ఫుడ్‌ కౌంటర్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య కేంద్రాలు తదితర విభాగాల పూర్తి సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా పొందవచ్చు.


ఇవి కూడా చదవండి...
జోరుగా యంగ్‌ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు

చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 06:08 AM