నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్18 ప్రయోగం
ABN , Publish Date - Oct 08 , 2026 | 07:05 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూళ్లూరుపేట, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన 2,232 కిలోల బరువున్న ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఇప్పటికే షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ అనుసంధాన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాకెట్ రెండు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. మూడు దశల అనుసంధానం అనంతరం రాకెట్ శిఖర భాగాన ఎన్‌వీఎ్‌స-03 ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు.
ఇవి కూడా చదవండి...
జోరుగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు
చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం
Read Latest AP News And Telugu News