Share News

గోవా కేంద్రంగా తెలంగాణలో సాగుతున్న డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

ABN , Publish Date - Oct 14 , 2026 | 07:09 PM

గోవా కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌ను తెలంగాణ ఈగల్ టీం ఛేదించింది. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ప్రధాన నిందితుడు ప్రీతీశ్ నారాయణ్ బోర్కర్ అలియాస్ బాబు అలియాస్ ఖలీ‌ని అరెస్ట్ చేసింది.

గోవా కేంద్రంగా తెలంగాణలో సాగుతున్న డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
hyderabad police arrested 3 drug pedlers in goa

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణలో మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌పై తెలంగాణ ఈగల్ టీం ఉక్కుపాదం మోపింది. గోవా కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసింది. గోవా పోలీసుల సహాయంతో.. ఈగల్ ఫోర్స్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.


ప్రధాన నిందితుడు ప్రీతీశ్ నారాయణ్ బోర్కర్ అలియాస్ బాబు అలియాస్ ఖలీ‌ని అక్టోబర్ 12న గోవాలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రీతీశ్‌కు తెలంగాణలో 1000 మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. నిందితుడికి ఆంధ్రప్రదేశ్‌లోనూ డ్రగ్స్ నెట్‌వర్క్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మరో నిందితుడు బషారత్ అహ్మద్ ధగ్గ అలియాస్ బిలాల్‌ను అరెస్ట్ చేసి.. అతడి దగ్గర నుంచి13 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, 8 ఎక్స్టసీ మాత్రలు, సుమారు 100 గ్రాముల చరస్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ ఒకటిన్నర లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. డ్రగ్స్ సరఫరాలో మధ్యవర్తులు, ఇతర పెడ్లర్లు, వినియోగదారుల పాత్రపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. కాగా.. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ నెంబర్ 1908కు ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలూ చదవండి

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో

Updated Date - Oct 14 , 2026 | 07:09 PM