అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో
ABN , Publish Date - Oct 13 , 2026 | 08:07 AM
అడవిలో నుంచి ఒక వ్యక్తికి వింత శబ్దాలు వినిపించాయి. ఎవరో ఏడుస్తున్నట్టు, అరుస్తున్నట్టు అతడికి అనిపించింది. ఓ వైపు భయం వేస్తున్నా ఆ వ్యక్తి ధైర్యం చేసి ముందుకు వెళ్లి చూడగా..
ఇంటర్నెట్ డెస్క్: అడవిలో నుంచి ఒక వ్యక్తికి వింత శబ్దాలు వినిపించాయి. ఎవరో ఏడుస్తున్నట్టు, అరుస్తున్నట్టు అతడికి అనిపించింది. ఓ వైపు భయం వేస్తున్నా ఆ వ్యక్తి ధైర్యం చేసి ముందుకు వెళ్లి చూశాడు. అప్పుడే ఓ దృశ్యం చూసి అతడు షాక్ అయ్యాడు. అడవిలోని ఓ లోతైన గొయ్యిలో చిక్కుకున్న ఒక ఎలుగుబంటి బిగ్గరగా విలపిస్తోంది. సహాయం కోసం పిలుస్తోంది. అది బయటకు రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయినా రాలేక అరుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అది చూసిన వీక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. లోతైన గొయ్యిలో చిక్కుకున్న ఆ ఎలుగుబంటి కోసం ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ దాన్ని రక్షించారా.. లేదా? అని చాలామంది కామెంట్లలో అడిగారు. వీడియో షేర్ చేసిన వ్యక్తి ఆ ఎలుగుబంటిని రక్షించామని తెలిపారు. అయితే రెస్క్యూకి సంబంధించిన వీడియో ఇంకా విడుదల కాలేదు. ఈ ఘటన మానవత్వం, వన్యప్రాణుల సంరక్షణపై చర్చకు దారితీసింది. మనుషులలాగా వన్యప్రాణులు సహాయం అడగలేవని, అందుకే వాటిని రక్షించే బాధ్యత అందరిపై ఉందని కొందరు చెబుతున్నారు. ప్రమాదకరమైన ఎలుగుబంటిని రక్షించిన ఆ వ్యక్తి ధైర్యాన్ని ఇంకొందరు మెచ్చుకుంటున్నారు. కాగా ఈ వీడియోను దాదాపు 39 లక్షల మంది వీక్షించారు.
ఇవీ చదవండి
ఇంచ్ గ్యాప్‌లో బయటపడ్డాడుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
సీసీటీవీ కెమరా నుంచి తప్పించుకోలేవు బ్రో.. జాగ్రత్త! వైరల్ వీడియో