పోలవరం రెండో దశ పనులపై కేంద్రం ఆరా
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:28 AM
పోలవరం ప్రాజెక్టు రెండో దశ పనుల కార్యాచరణపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖలను కేంద్ర జలశక్తి కార్యదర్శి అర్చనావర్మ ఆరా తీశారు.
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు రెండో దశ పనుల కార్యాచరణపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖలను కేంద్ర జలశక్తి కార్యదర్శి అర్చనావర్మ ఆరా తీశారు. ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశంలో పోలవరం మొదటి దశ పనుల పూర్తి.. రెండో దశ పనులు ప్రారంభం వంటి అంశాలపై ఆమె సమీక్షించారు. పోలవరం తొలిదశ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని పీపీఏ ఈ సందర్భంగా వెల్లడించింది. రెండో దశ పనులు చేపట్టేందుకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందని తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి: