Share News

ఇంచ్‌ గ్యాప్‌లో బయటపడ్డాడుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:07 PM

రోడ్డుపై నిర్లక్ష్యం.. చేతిలో ఫోన్.. అంతలోనే ఊహించని ప్రమాదం! బైక్‌పై నిల్చుని ఫోన్ చూస్తున్న యువకుడిని కారు ఢీకొట్టడంతో బైక్‌ ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తూ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇంచ్‌ గ్యాప్‌లో బయటపడ్డాడుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Thoothukudi Bike Accident

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంటాయి. తాజాగా.. తమిళనాడులోని తూత్తుకుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రోడ్డుపై ఓ యువకుడు బైక్‌పై కూర్చుని నిర్లక్ష్యంగా ఫోన్ చూస్తున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌ ఒక్కసారిగా ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటన రెప్పపాటులో జరిగిపోయింది.


ఈ ప్రమాదంలో బైక్‌ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ.. యువకుడు ప్రాణాలతో బయటపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. కారు బైకును ఢీకొట్టడంతో.. ఆ యువకుడు ఒక్కసారిగా కూలబడిపోయాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి ప్రమాదం ఎదురవుతుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. వాహనం నడిపేటప్పుడు లేదా రోడ్డుపై ఉన్నప్పుడు ఫోన్‌ చూడటం, అజాగ్రత్తగా వ్యవహరించడం ప్రాణాలకే ప్రమాదకరమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘భూమిపై నూకలు ఉన్నాయి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘నిర్లక్ష్యానికి భలే శిక్ష పడింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘రోడ్లపై నిర్లక్ష్యంగా ఉంటే ఇలాగే ఉంటుంది.. ఇంకా నయం ప్రాణాలతో బయటపడ్డాడు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...

అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...

Read Latest AP News And Telangana News

Updated Date - Oct 11 , 2026 | 06:18 PM