Share News

సీసీటీవీ కెమరా నుంచి తప్పించుకోలేవు బ్రో.. జాగ్రత్త! వైరల్ వీడియో

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:08 PM

తనను ఎవరూ చూడట్లేదని రాత్రి వేళ రోడ్డుపై చెత్త వేసిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కైపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సీసీటీవీ కెమరా నుంచి తప్పించుకోలేవు బ్రో.. జాగ్రత్త! వైరల్  వీడియో
Throwing Garbage on Road

ఇంటర్నెట్ డెస్క్: కొందరు తప్పు చేయడానికి ఇష్టపడరు. మరికొందరు తమను ఎవరూ చూడని సందర్భాల్లో చిన్న చిన్న తప్పులు నిస్సంకోచంగా చేస్తుంటారు. ఆ తరువాత దర్జాగా చేతులు దులుపుకుని వెళ్లిపోతారు. అయితే ఇలాంటి తుంటరి పనులకు కాలం చెల్లిందని చెప్పే ఓ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరూ చూడట్లేదనుకుని రెచ్చిపోయిన ఓ వ్యక్తి సీసీటీవీ కెమెరాకు చిక్కడంతో తెల్లముఖం వేశాడు. గ్రేటర్ నోయిడాలోని సెక్టర్ బీటా 1లో అక్టోబర్ 9న ఈ ఘటన వెలుగు చూసింది.


సెక్టర్ బీటా1లోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ (ఆర్‌డబ్ల్యూఏ) వాళ్లు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఆ వ్యక్తి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కుకుపోయాడు. ఆ రాత్రి అతడు చంటిపిల్లాడితో పాటు బయటకు వచ్చాడు. తన ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఓ గోడ పక్కన చెత్త వేసి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆ ప్రాంతాన్ని సీసీటీవీ కెమెరాతో గమనిస్తున్న ఆర్‌డబ్ల్యూఏ వారు స్పీకర్‌లో ఆ వ్యక్తిని అప్రమత్తం చేశారు. చెత్త వేయొద్దని గట్టిగా హెచ్చరించారు. దీంతో, ఆ వ్యక్తి క్షణకాలం పాటు దిమ్మెరపోయాడు. తనను ఎవరూ హెచ్చరిస్తున్నారో అర్థంకాక అటూ ఇటూ చూసి దిమ్మెరపోయాడు. వేసిన చెత్తను వెనక్కు తీసుకోకపోతే ఫైన్ వేస్తామని వెల్ఫేర్ అసోసియేషన్ వారు హెచ్చరించారు. దీంతో, అతడు మారుమాట్లాడకుండా చెత్తను తీసుకుని వెళ్లిపోయారు.


ఈ ఘటనపై నెట్టింట ఛలోక్తులు పేలుతున్నాయి. సీసీటీవీ కెమెరాలు చూస్తున్నాయి జాగ్రత్త.. బ్రో అని పలువురు సరదా కామెంట్స్ చేశారు. రాత్రిళ్లు చెత్త వేస్తే ఎవరూ చూడరని అనుకుని ఉంటాడని మరికొందరు అన్నారు. సీసీటీవీ కెమరాలతో ఇలాంటి వారిలో పౌర స్పృహ పెరుగుతుందని ఇంకొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్‌ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ ఓ లుక్కేయండి.


ఈ వార్తలనూ చదవండి:

ఇంగ్లండ్‌లో విషాదం.. పులి దాడిలో యువకుడి మృతి..

ఢిల్లీలో ఆంక్షలపై శశి థరూర్‌ ఆగ్రహం.. ‘ఎమర్-జెన్‌జీ’ అంటూ విమర్శలు

Updated Date - Oct 11 , 2026 | 02:57 PM