రేపు విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:35 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలో రెండు రోజులు పర్యటించనున్నారు. బుధవారం ఆమె విజయవాడ చేరుకుంటారు. ఆ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంటారు.
విజయవాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలో రెండు రోజులు పర్యటించనున్నారు. బుధవారం ఆమె విజయవాడ చేరుకుంటారు. ఆ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంటారు. రాత్రి విజయవాడలోనే బస చేస్తారు. 15వ తేదీన పున్నమి ఘాట్‌లో జరిగే జాతీయ సరస్ మేళా-2026ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వాధికారులు పూర్తిచేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విజయవాడ నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి: