Share News

హైదరాబాద్‌లో గంజాయి సప్లై నెట్‌వర్క్ గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:15 PM

ఈగల్ ఫోర్స్, చౌటుప్పల్ పోలీసులు గురువారం హైదరాబాద్‌లో జాయింట్ ఆపరేషన్‌ చేశారు. ఈ తనిఖీలో హైదరాబాద్‌ కేంద్రంగా గంజాయి అమ్ముతున్న అస్సాం గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో గంజాయి సప్లై నెట్‌వర్క్ గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్
Hyderabad Drug Bust

హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఈగల్ ఫోర్స్, చౌటుప్పల్ పోలీసులు ఈరోజు (గురువారం) హైదరాబాద్‌లో జాయింట్ ఆపరేషన్‌ చేశారు. ఈ తనిఖీలో హైదరాబాద్‌ కేంద్రంగా గంజాయి అమ్ముతున్న అస్సాం గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ముఠా కీలక సూత్రధారి భాస్కర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 24.7 కిలోల గంజాయి, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్‌లో ఈ ముఠా విక్రయిస్తోందని అధికారులు తెలిపారు. కొరియర్లు, ప్యాకర్లు, డెలివరీ నెట్‌వర్క్‌ను ప్రధాన నిందితుడు భాస్కర్ ఏర్పాటు చేసుకున్నాడు. గత 10 నెలల్లో సుమారు 400 కిలోల గంజాయి విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. గంజాయి వ్యాపారం ద్వారా రూ.1.8 కోట్ల అమ్మకాలు జరిపినట్లుగా ఈగల్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు.


కుత్బుల్లాపూర్‌లో గంజాయి మొక్కల సాగు..

కుత్బుల్లాపూర్‌లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధి కైసర్ నగర్‌లో అక్రమంగా గంజాయి మొక్కల సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అల్లాపూర్‌కు చెందిన వెల్డర్ ఎండీ అయాజ్ వ్యాస్ (54)గా నిందితుడిని గుర్తించారు. కైసర్ నగర్‌లోని ఓపెన్ ప్లాట్‌లో 5 అడుగులు, 4 అడుగుల ఎత్తు పెరిగిన 2 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు సూరారం పోలీసులు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క

భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 05:40 PM