Share News

భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Nov 04 , 2026 | 07:15 PM

వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికి సమగ్ర సర్వే నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి
Telangana Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికి సమగ్ర సర్వే నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భూమి ఉన్న ప్రతి రైతుకు ఆధార్ తరహాలో భద్రతతో కూడిన భూ రికార్డులు ఇస్తున్నామని తెలిపారు. ఈరోజు (బుధవారం) మేడ్చల్ కలెక్టరేట్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భూ సర్వే, రెవెన్యూ అంశాలపై మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు.


పక్కా హద్దులతో కొత్త పాస్‌బుక్కులు అందిస్తాం..

వివాదరహిత భూములు, పక్కా హద్దులతో కొత్త పాస్‌బుక్కులు అందించడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సర్వే జరిగే గ్రామాల్లో ప్రతిరోజూ తహసీల్దార్లు పర్యటించాలని ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు వారానికోసారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మార్గనిర్దేశం చేశారు. సుమారు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో భారీస్థాయిలో సమగ్ర భూ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సర్వే నంబర్లు, వాస్తవ భూమి స్వాధీనంలో ఉన్న తేడాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పుకొచ్చారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.


22-A భూమి సమస్యల పరిష్కారానికి చర్యలు..

పట్టా భూములు, ఆయా భూముల హద్దుల వివాదాలను గుర్తించి పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను అధికారుల సమక్షంలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఆయా సమస్యలను దాచకుండా నిజాయితీగా వివరించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై తక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. 22-A భూమి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 07:45 PM