Share News

విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 04 , 2026 | 10:11 PM

విద్యార్థుల యూనిఫాంలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని అధికారులను.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. యూనిఫాంల రంగులు, డిజైన్లపై విద్యార్థుల అభిప్రాయాల సేకరించాలని సూచించారు.

విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల యూనిఫాంలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని అధికారులను.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆదేశించారు. యూనిఫాంల రంగులు, డిజైన్లపై విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యార్థులకు యూనిఫాం, కిట్స్ పంపిణీపై సీఎం ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.


యూనిఫాంలు, కిట్ల పంపిణీకి ప్రత్యేక ఎస్‌వోపీ రూపొందించాలి..

విద్యార్థులు కోరుకున్న రంగులు, డిజైన్లకు భవిష్యత్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. యూనిఫాంలు, కిట్ల పంపిణీకి ప్రత్యేక ఎస్‌వోపీ రూపొందించాలని ఆదేశించారు. స్కూల్ బ్యాగులు, షూలు, సాక్సులతో సహా కిట్ల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. మిగిలిన వస్తువుల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు పూర్తి కిట్లు అందించాలని సూచించారు. టెండర్లు, సరఫరా, పంపిణీకి ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.


ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపై సీఎం ఆరా

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 10:14 PM