Share News

తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క

ABN , Publish Date - Nov 04 , 2026 | 02:25 PM

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో డీప్‌టెక్, సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ‎

తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka

హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో డీప్‌టెక్, సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ‎ఈరోజు (బుధవారం) బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో FICCI @100 వేడుకలు, తెలంగాణ డీప్‌టెక్ లీడర్‌షిప్ సమ్మిట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క హాజరై, మాట్లాడారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తులుగా మారాలని మార్గనిర్దేశం చేశారు.


డీప్‌టెక్ అభివృద్ధికి హైదరాబాద్‌లో అపారమైన అవకాశాలు..

డీప్‌టెక్ అభివృద్ధికి హైదరాబాద్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని భట్టి విక్రమార్క వెల్లడించారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, బయోటెక్, ఏరోస్పేస్ రంగాల సమన్వయంతో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, పరిశోధకులు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.యువ స్టార్టప్‌లకు ఉమ్మడి పరీక్షా కేంద్రాలు, సులభతర ధ్రువీకరణ విధానాలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం, పరిశ్రమలు అండగా నిలవాలని అన్నారు. విజయవంతమైన ప్రయోగాలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. పునరుత్పాదక విద్యుత్ వినియోగం, విద్యుత్ నిల్వ, స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థల్లో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించాలని చెప్పుకొచ్చారు.


డీప్‌టెక్ రంగం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు..

వైద్య రంగంలో వ్యాధులను ముందుగానే గుర్తించే ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి రావాలని భట్టి విక్రమార్క అభిలాషించారు. రైతులకు తక్కువ ఖర్చుతో ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. సాంకేతిక ఉత్పత్తుల రూపకల్పన దశ నుంచే సామాన్యులకు అందుబాటులోని ధరలను దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. డీప్‌టెక్ రంగం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పాదకత పెంపునకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడాలని సూచించారు. ఆవిష్కరణల ఫలితాలు ప్రజల ఆదాయాల పెరుగుదల, మెరుగైన ప్రభుత్వ సేవలు, ఉపాధి అవకాశాల రూపంలో కనిపించాలని పేర్కొన్నారు. భారతీయ ఆలోచనలు, ఆవిష్కరణలు ప్రపంచస్థాయి పారిశ్రామిక సంస్థలుగా ఎదగాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 04:28 PM