ఈ- సిగరెట్ల అక్రమ రవాణాపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:44 PM
హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా నెట్‌వర్క్‌ను ఈగల్ ఫోర్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. కరీంనగర్‌లో మైనర్‌కు ఈ-సిగరెట్లు విక్రయిస్తుండగా ఈ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా నెట్‌వర్క్‌ను ఈగల్ ఫోర్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. కరీంనగర్‌లో మైనర్‌కు ఈ-సిగరెట్లు విక్రయిస్తుండగా ఈ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ నిందితుడు మహ్మద్ ఆసిఫ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాహిల్ ఖాన్ అలియాస్ ఒమర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 19 ఈ-సిగరెట్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చార్మినార్ మక్కా మసీదు ఎదురుగా ఫుట్‌పాత్‌పై రాహిల్ బట్టల వ్యాపారం చేస్తున్నాడు. దుస్తుల కొనుగోలు కోసం కోల్‌కతా వెళ్లిన సమయంలో ఈ - సిగరెట్ల ముఠాతో నిందితుడికి పరిచయం ఏర్పడింది. కోల్‌కతాలోని ఆదిల్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి కొరియర్ ద్వారా ఈ-సిగరెట్ల సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు 20 సార్లకు పైగా ఈ-సిగరెట్ల పంపిణీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వేర్వేరు పేర్లు, మొబైల్ నంబర్లు, గూగుల్ పే ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మిగతా నిందితుల కోసం ఈగల్ ఫోర్స్ అధికారులు గాలిస్తున్నారు
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News