Share News

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:47 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
Telangana CM Revanth Reddy Delhi Visit

ఢిల్లీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Narendra Modi) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఈరోజు (ఆదివారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. సీఎంతో పాటు ప్రధానిని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి కలిశారు. డిసెంబరు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే గ్లోబల్ సమ్మిట్‌, అలాగే, డిసెంబరులో జరిగే ఖేలో ఇండియా క్రీడల ప్రారంభానికి ప్రధానిని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఆహ్వానించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలతో పాటు ఎల్‌నినో ప్రభావంపై ప్రధాని నరేంద్రమోదీతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం చర్చించినట్లు తెలుస్తోంది.


తెలంగాణ రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితులను ప్రధానికి వివరించి కేంద్ర సహాయాన్ని సీఎం అడిగినట్లు సమాచారం. 365 మండలాలను కరువు మండలాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రూ.30వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తోంది. అలాగే,152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి, సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి అనుమతులు ఇప్పించాలని సీఎం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. గోదావరి - కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టును సమ్మక్కసాగర్‌ లేదా ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలని, ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో 50 శాతం వాటాను తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి బృందం విన్నవించినట్లు తెలుస్తోంది. సీతమ్మసాగర్‌ బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి అడిగినట్లు సమాచారం. రేపు (సోమవారం) కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ

దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 12:35 PM