Share News

దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:47 AM

మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన 420 హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Telangana Minister Komatireddy Venkat Reddy

హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Telangana Minister Komatireddy Venkat Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన 420 హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారని.. ఆ హామీ సంగతి ఏమైందని ప్రశ్నించారు.


సోనియాగాంధీ లేనిది తెలంగాణ లేదు..

బీఆర్ఎస్ హయాంలో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? మీరా అని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. సంక్షేమం, అభివృద్ధి ఎలా చేయాలో తమను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని తమకు రీ లాంచ్ చేయాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో సోనియా గాంధీ చరిత్ర మొదటి పేజీలో ఉంటుందని ఉద్ఘాటించారు. సోనియా లేనిది తెలంగాణ లేదని.. తాము రాసే చరిత్రలో సోనియా గాంధీ పేరు తప్పనిసరిగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 11:42 AM