Share News

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:05 PM

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు గురువారం ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు వనపర్తిలో మెరుపు దాడులు జరుపుతున్నారు.

 ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Telangana ACB Raids

హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు ఈరోజు (గురువారం) ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు వనపర్తిలో మెరుపు దాడులు జరుపుతున్నారు. ఇరిగేషన్ అండ్ సీఏడీ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్. సత్యనారాయణ (44) నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో పది ఏసీబీ బృందాలు రైడ్స్ చేపట్టాయి. ఈ సోదాల్లో పలు ఆస్తులు, కీలక పత్రాలు కూడా బయటపడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రైడ్స్ అనంతరం పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

‘సర్’ పేరుతో మైనారిటీలు, దళితులు, పేదల ఓట్లను మోదీ సర్కార్ తొలగిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌కు వంచన

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:03 PM