Share News

మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌కు వంచన

ABN , Publish Date - Nov 11 , 2026 | 08:56 AM

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమపేరుతో బాలికను వంచించి జాటోత్ ప్రవీణ్ అనే యువకుడు గర్భవతిని చేశాడు.

మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌కు వంచన

మహబూబాబాద్ జిల్లా, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమపేరుతో బాలికను వంచించి జాటోత్ ప్రవీణ్ (28) అనే యువకుడు గర్భవతిని చేశాడు. బాధితురాలు తొర్రూరు మండలంలోని ఓ ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.


ఈ క్రమంలో గర్భవిత్తిచ్చి కోసం బాలికకు మాత్రలను ప్రవీణ్ ఇచ్చాడు. మైనర్ అనారోగ్య పాలు కావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో తొర్రూర్ మండలం మంగ్యాతండాలోని ప్రవీణ్ ఇంటిముందు బాలిక కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు సర్ధిచెప్పడంతో వారు నిరసనను విరమించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తొర్రూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కరవు ప్రభావిత ప్రాంతాల్లో పంట రుణాలను రీషెడ్యూలింగ్ చేయాలి: మంత్రి తుమ్మల

19న మరో పథకం ప్రారంభం.. మంత్రి వివేక్ కీలక ప్రకటన

కొడంగల్‌ పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 10:24 AM