కొడంగల్ పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Nov 10 , 2026 | 07:16 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లోని పోలేపల్లిలోని ప్రసిద్ధ శ్రీ ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1/16
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లోని పోలేపల్లిలోని ప్రసిద్ధ ఎల్లమ్మ దేవాలయాన్ని సోమవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2/16
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోసం సీఎం ప్రార్థించారు.
3/16
ఎల్లమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
4/16
ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, ఆరోగ్యం వెల్లివిరియాలని, రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుకున్నారు.
5/16
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
6/16
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే దేవాలయాలను సందర్శించడం ద్వారా భక్తి భావాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చాటుకున్నారు.
7/16
ముఖ్యమంత్రి ఆలయ సందర్శనతో స్థానికంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
8/16
అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
9/16
అక్కడి నుంచి లగచర్ల చేరుకుని ఇండస్ట్రీయల్ కారిడార్‌లో నిర్మిస్తున్న ఎకో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
10/16
అనంతరం వేలాది మందితో కలిసి హకీంపేట బహిరంగ సభ వరకు ముఖ్యమంత్రి పాదయాత్ర నిర్వహించారు.
11/16
అక్కడ పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన రైతు ఆత్మీయ సభలో మాట్లాడారు.
12/16
దేవుడు తనకు జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని అవకాశాలు ఇచ్చారని, ఇక ప్రజలకు తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
13/16
తెలంగాణను నంబర్‌వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టేందుకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానని, సీఎం అయిన తర్వాత ఒక్క రోజూ సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
14/16
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని, అయితే ఈ సమస్యను కలిసికట్టుగా ఎదుర్కొందామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
15/16
సాధారణంగా కరవు వస్తే ఆహార ధాన్యాలు, తాగునీటి కొరత ఏర్పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ప్రధానంగా నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
16/16
రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
Updated at - Nov 10 , 2026 | 07:29 AM