Share News

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:42 PM

ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా తీస్తే బాగుంటుందని తనకు అనిపించిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఈ చిత్ర ప్లానింగ్ ప్రకటిస్తామని పేర్కొన్నారు.

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
Jagga Reddy

హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) ఆత్మకథను సినిమాగా తీస్తే బాగుంటుందని తనకు అనిపించిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఈ చిత్రం ప్లానింగ్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న వారి నుంచి మోరల్ సపోర్టుతో ముందుకెళ్తానని తెలిపారు. వచ్చేనెల 9వ తేదీకి ఈ మూవీని ప్రారంభించి.. వచ్చే సోనియా గాంధీ జన్మదినంలోగా పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ఈరోజు (గురువారం) గాంధీ భవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ చిత్రానికి ఫైనాన్షియల్ సపోర్ట్‌ను స్థానికంగా ఉన్న వాళ్ల నుంచి తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం సోనియా గాంధీలాగా నిలబడిన చరిత్ర మరో రాజకీయ కుటుంబానికి లేదని పేర్కొన్నారు.


గాంధీ కుటుంబం త్యాగం వేరు..

భారతదేశంలో చాలామంది ప్రధానులుగా పనిచేశారని.. కానీ గాంధీ కుటుంబం త్యాగం వేరని జగ్గారెడ్డి ఉద్ఘాటించారు. సోనియా గాంధీ ప్రధానిగా ఉండాలని గతంలో అన్ని పార్టీల నాయకులు ప్రపోజ్ చేశారని.. కానీ ఆమె ఈ విషయాన్ని అనుమతించలేదని తెలిపారు. మూడుసార్లు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పుడు పరిస్థితులను సోనియా గాంధీ దృష్టిలో పెట్టుకొని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని పునరుద్ఘాటించారు. ఈ దేశంలో ఉండి ప్రజలను అవగాహన చేసుకోలేని బీజేపీ గొప్పదా..? అని ప్రశ్నించారు. ఈ దేశానికి కోడలిగా వచ్చి ప్రజలను దృష్టిలో పెట్టుకొని పాలన చేసిన సోనియా గాంధీ గొప్పవారా..? అని బీజేపీ నేతలను నిలదీశారు.


కంగనా రనౌత్‌కు రాజకీయాలు, నాయకుల చరిత్రలు తెలుసా?..

మూడుసార్లు ప్రధానిగా అవకాశం వదులుకున్న సోనియా గాంధీ పుస్తకం ద్వారా ఏదో ఆశిస్తారని కొంతమంది అనుకోవటం తప్పని జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఏమైనా రాజకీయ నాయకురాలా?, ఆమె ఒక నటిలాగా మాత్రమే ఇప్పటికీ వ్యవహారిస్తున్నారని విమర్శించారు. ఆమెకు డైలాగ్ రాసి ఇస్తే చెబుతోందని.. నటిస్తోందని ఎద్దేవా చేశారు. కంగనా రనౌత్‌కు రాజకీయాలు, నాయకుల చరిత్రలు తెలుసా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ తానే ఇచ్చానని పుస్తకంలో ఎవరైనా రాస్తారా..? అని బీజేపీ నేతలను నిలదీశారు. రూ.1000లు ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టుకొనే ఈ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా.. ఈ విషయం గురించి చెప్పుకోకపోవటంలోనే సోనియాగాంధీ గొప్పతనం ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

‘సర్’ పేరుతో మైనారిటీలు, దళితులు, పేదల ఓట్లను మోదీ సర్కార్ తొలగిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌కు వంచన

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:49 PM