అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ABN , Publish Date - Nov 12 , 2026 | 08:35 AM
అండాలను అక్రమంగా సేకరించిన కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్న విషయం తెలిసిందే. గురువారం నిందితులను మరోసారి విచారించనున్నారు.
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): అండాలను అక్రమంగా సేకరించిన కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు (గురువారం) నిందితులను మరోసారి విచారించనున్నారు. ఎనిమిది మంది నిందితులను నిన్న (బుధవారం) కోర్టు అనుమతితో జైలు నుంచి కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు. ఈనెల 15వ తేదీ వరకు నిందితులను పోలీసులు విచారించనున్నారు. ఐవీఎఫ్ కేంద్రాలు, ఫెర్టిలిటీ సెంటర్లతో వారికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
ఇవాళ్టి విచారణలో ఆర్థిక లావాదేవీలు, ముఠా నెట్‌వర్క్ వివరాలను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అండాల సేకరణలో బేగంపేట్, సరూర్ నగర్‌లలో మొత్తం మూడు కేసులను నమోదు చేశారు. ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీన అండాల అక్రమ సేకరణ దందా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు అమిత్ శర్మ, నిఖిత్ పర్వీన్, రేష్మా ఖాతూన్, మేఘావత్ శ్రీనివాస్, ఎస్కే పర్వీన్, విజయ్ భాగ్యరావు, పంకజ్ సోని , దుర్గాప్రసాద్‌లను అరెస్టు చేశారు. సైదాబాద్‌కు చెందిన ప్రవీణ్ ద్వారా నకిలీ ఆధార్ కార్డుల తయారీ, యువతులు, మహిళల నుంచి పలుమార్లు అండాలను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘సర్’ పేరుతో మైనారిటీలు, దళితులు, పేదల ఓట్లను మోదీ సర్కార్ తొలగిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌కు వంచన
ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News