Share News

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:47 AM

తెలంగాణలోని గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాన్ని లోక్‌సభలో ప్రతిపక్షనేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రారంభించారు. శనివారం గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాహుల్‌గాంధీతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ
Rahul Gandhi

హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాన్ని లోక్‌సభలో ప్రతిపక్షనేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ప్రారంభించారు. ఈరోజు (శనివారం) గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఆయనతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఆయన చర్చించారు. గిగ్ వర్కర్స్ కోసం రూపొందించిన విధివిధానాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంక్షేమ పథకంతో పాటు బోర్డును లాంఛ్ చేశారు.


గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ ర్యాలీ..

అలాగే, గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ నేపథ్యంలో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. వాహనదారుల కోసం ట్రాఫిక్‌ను మళ్లించారు. రాహుల్ గాంధీతో పాటు ఈ ర్యాలీలో గిగ్ వర్కర్లకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ముందు వరుసలో మహిళా గిగ్ వర్కర్స్ కోసం వాహనాలను ఏర్పాటు చేశారు.


గిగ్ వర్కర్లకు న్యాయం చేస్తాం: రాహుల్‌గాంధీ

గిగ్ వర్కర్ల బాధలు, కష్టాలను తాను ప్రత్యేకంగా విన్నానని లోక్‌సభలో ప్రతిపక్షనేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. వారికి న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా కల్పించారు. రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10లక్షల జీవిత బీమాతో పాటు పెన్షన్‌ను కూడా అమలు చేస్తామని మాటిచ్చారు. మాములుగా అన్ని కంపెనీల డేటా ఉంటుందని.. గిగ్ వర్కర్ల డేటా ఉండదని చెప్పుకొచ్చారు. ఇక నుంచి వారి డేటా ఎక్కడైనా చూసుకోవచ్చని తెలిపారు. వారి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటాయని వివరించారు. గిగ్ వర్కర్ల కోసం వైఫైతో కూడిన షెల్టర్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అర్ఎస్ఎస్‌కు ప్రజాసమస్యలు అంటే నచ్చవని అన్నారు. మోదీకి రాజకీయాలు చేయడం మాత్రమే బాగా తెలుసునని విమర్శించారు. తమకు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కూడా తెలుసునని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


గిగ్ వర్కర్లను ఆదుకుంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

గిగ్ వర్కర్ల కోసం చాలామంది అభిప్రాయం తీసుకున్నాకే ఈ సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పష్టం చేశారు. వారికి గుర్తింపు ఇచ్చి, ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని మాటిచ్చారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. మాటిస్తే గాంధీ కుటుంబం తప్పనిసరిగా అమలు చేసి తీరుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 12:13 PM