గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:12 PM
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఆయన నోట పలికేవన్నీ గాలి మాటలేనని విమర్శించారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) కౌంటర్ ఇచ్చారు. ఆయన నోట పలికేవన్నీ గాలి మాటలేనని విమర్శించారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. ఆయన నోట వినిపించిన 6 గ్యారంటీలన్నీ గాలి మూటలుగానే మిగిలిపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు. వరంగల్, కామారెడ్డి డిక్లరేషన్‌ల అమలు ఏమైంది? అని నిలదీశారు.
ఆరోగ్య భద్రత కల్పిస్తామంటే నమ్మేదేలా?..
తెలంగాణలో గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ సర్కార్ ఆరోగ్య భద్రత కల్పిస్తామంటే నమ్మేదేలా..? అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు సరే.. నిధులేవి అని నిలదీశారు. ఆటోడ్రైవర్లు, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తూ రాజస్థాన్ తరహా చట్టాన్ని అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాజస్థాన్‌లో వారికి సంక్షేమ బోర్డుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని ప్రస్తావించారు.
రాజస్థాన్‌లో సంక్షేమ పథకాల్లో గిగ్ వర్కర్లకు అర్హత ..
Ola, Uber వంటి అగ్రిగేటర్ సంస్థల నుంచి ప్రతి లావాదేవీపై నిర్ణీత శాతం సంక్షేమ రుసుమను అక్కడి ప్రభుత్వం వసూలు చేస్తోందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల్లో గిగ్ వర్కర్లకు అర్హత కల్పిస్తోందని అన్నారు. కంపెనీలు చెల్లింపులు చేయకపోయినా, ఇతర సమస్యలు ఎదురైనా ఫిర్యాదు చేస్తే పరిష్కరించే వ్యవస్థ ఉందని గుర్తుచేశారు. చట్టాన్ని ఉల్లంఘించే అగ్రిగేటర్ సంస్థలకు పెద్దఎత్తున జరిమానా విధిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలో గిగ్ వర్కర్లకు ఆ సౌకర్యాలన్నీ కల్పించే దమ్ముందా అని బండి సంజయ్ కుమార్ సవాల్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News