Share News

సీరియల్స్‌లో అవకాశాల పేరుతో మహిళకు వేధింపులు.. అశ్లీల చిత్రాలతో బ్లాక్‌మెయిల్

ABN , Publish Date - Nov 15 , 2026 | 09:09 AM

హైదరాబాద్‌లో సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మహిళకు కాళిదాస్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. ఈ విషయంపై జూబ్లీహిల్స్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీరియల్స్‌లో అవకాశాల పేరుతో మహిళకు వేధింపులు.. అశ్లీల చిత్రాలతో బ్లాక్‌మెయిల్
Woman Harassment Case

హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): నగరంలో సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మహిళకు కాళిదాస్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. ఈ విషయంపై జూబ్లీహిల్స్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన మహిళతో కాళిదాస్ పరిచయం పెంచుకున్నాడు. సన్నిహితంగా ఉంటూ మహిళకు సంబంధించిన అశ్లీల చిత్రాలను తీశాడు. తొలుతగా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించేలా చేస్తానని కాళిదాస్ ఆమెను నమ్మించాడు. శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ మహిళపై ఒత్తిడి తీసుకువచ్చాడు.


అతడి ప్రతిపాదనను బాధితురాలు తిరస్కరించింది. అశ్లీల చిత్రాలు బంధువులకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ మహిళను బెదిరించాడు. చంపేస్తానంటూ బాధితురాలిని కాళిదాస్ భయభ్రాంతులకు గురిచేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ

దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 09:58 AM