కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:25 PM
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద మాత్రమే నీటి నిల్వకు అవకాశం ఉందని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద మాత్రమే నీటి నిల్వకు అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు(ఆదివారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటి నిల్వ పనులను మంత్రి పరిశీలించారు. అలాగే, దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో పర్యటించారు. తన జన్మదినం సందర్భంగా పూసుకుంట గిరిజనులతో సమావేశమయ్యారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకొని అర్హులైన గిరిజనులకు పెన్షన్లు, రేషన్ కార్డులు, జాబ్ కార్డులు, పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.
ఎల్‌నినో ప్రపంచానికి విపత్తులా మారింది..
ఎల్‌నినో ప్రపంచానికి విపత్తులా మారిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఎల్‌నినో ప్రత్యేక పరిస్థితుల్లో తాగునీటికి ఎద్దడి లేకుండా నీటిని నిల్వ చేస్తున్నామని వెల్లడించారు. గతంలో మాదిరిగా గోదావరిలో నీటి ప్రవాహం లేదని చెప్పుకొచ్చారు. తాగునీటి గండం లేకుండా నీటిని నిల్వ చేస్తున్నామని వివరించారు. సీతమ్మ సాగర్ పూర్తి అయితే 36 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చని అన్నారు. 350 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
సీతమ్మ సాగర్ నిర్మాణం పూర్తి అవకపోవడంతో ఆనకట్ట ఎత్తు పెంచుతామని మంత్రి తుమ్మల అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా ఇబ్బంది లేకుండా నీటిని నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. దుమ్ముగూడెం ఆనకట్టపై మీటర్ ఎత్తున ఇసుక బస్తాలు ఏర్పాటు చేస్తామని.. ఇప్పటికే మూడు లేయర్లు ఇసుక బస్తాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మరో రెండు, మూడు లేయర్లు ఇసుక బస్తాలు ఏర్పాటు చేస్తామని, ఒక టీఎంసీ మేర నీటిని నిల్వ చేయొచ్చని అన్నారు. గోదావరి నీటి నిల్వ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్
గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ
దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News