Home » Bhadradri Kothagudem
పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని రేగా కాంతారావు పేర్కొన్నారు.
ఓఈఆర్ పెరగటంతో వచ్చే నెల నుంచి కొత్త ధర అమలులోకి రానున్నాయి. టన్నుకు 500 రూపాయలకుపైగా ధర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతులు ఇవాళ(శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. కరకగూడెం మండలం అశ్వాపురపాడు గ్రామం అటవీ ప్రాంతంలో వలస ఆదివాసీ పోడు రైతులు దాడి చేశారు.
దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. తెలంగాణ గేమ్ ఛేంజర్‌గా ఆయిల్ పామ్ సాగవుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
బీటీపీఎస్ పరిసర ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఫ్లైయాష్ బ్రిక్స్‌ను అందిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మండలంలోని బీటీపీఎస్ కర్మాగారానికి చెందిన ఫ్లై యాష్ పాండ్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం పరిశీలించారు.
అభం శుభం తెలియని ఓ గిరిజన బాలిక. తన కుటుంబ సభ్యులను చూడాలనుకుని ఎంతో ఆనందంతో స్వగ్రామానికి బయలుదేరింది. తన అన్నయ్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పింది.
ఎగువన భారీ వర్షాలకు వస్తున్న వరదతో పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. మంగళవారం 404.60 అడుగులకు చేరింది. దీంతో రాత్రి రెండుగేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదలచేశారు.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం 404.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడం నుంచి గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి జలాశయానికి 1,700 క్యూసెక్కుల చొప్పున నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు.
Tamarind Tree: ఓ చిన్న చింత మొక్క అటు, ఇటు కదులుతూ ఉంది. అది గాలికి కదులుతున్నట్లుగా లేదు. ఎవరో కిందినుంచి అటు, ఇటు తిప్పుతున్నట్లుగా ఉంది.
ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూసిన ఇద్దరిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.