Share News

TG News: ఇందిరమ్మ ఇళ్లకు.. ఫ్లైయాష్‌ బ్రిక్స్‌...

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:56 PM

బీటీపీఎస్‌ పరిసర ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఫ్లైయాష్‌ బ్రిక్స్‌ను అందిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మండలంలోని బీటీపీఎస్‌ కర్మాగారానికి చెందిన ఫ్లై యాష్‌ పాండ్‌ను కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం పరిశీలించారు.

 TG News: ఇందిరమ్మ ఇళ్లకు.. ఫ్లైయాష్‌ బ్రిక్స్‌...

- బీటీపీఎస్‌ సమీపంలో తయారీ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు..

- యాష్‌ పాండ్‌ను పరిశీలించిన కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

- మణుగూరు పరిసరాల్లోని లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్లు

మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): బీటీపీఎస్‌(BTPS) పరిసర ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఫ్లైయాష్‌ బ్రిక్స్‌ను అందిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మండలంలోని బీటీపీఎస్‌ కర్మాగారానికి చెందిన ఫ్లై యాష్‌ పాండ్‌ను కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాష్‌ ప్లాంట్‌ సమీపంలోని ఇటుకల తయారీ కేంద్రానికి సన్నాహాలు చేస్తున్నామని, యాష్‌తో పాటు స్థానికంగా ఇసుక వనరులు కూడా ఉండటంతో ఇటుకల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే లబ్ధిదారులకు ఇటుకలను సరఫరా చేయవచ్చునన్నారు.


దీంతో వారికి ఊరట లభించడంతో పాటు సరసమైన ధరలకు ఇటుకలను సరఫరా చేసినట్లవుతుందన్నారు. ఈ ప్లాంట్‌ నిర్మాణంతో స్థానిక యువతకు శిక్షణనిప్పించి ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటామన్నారు. డ్వాక్రా సంఘాలతో పాటు స్థానిక మహిళలకు ఈ పరిశ్రమ నిర్వహణ బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ఈప్రాంతంలో ఉన్న మహిళా సంఘాలకు తేనెటీగల పెంపకంపై పైపుణ్య శిక్షణ ఇప్పించి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు చర్యలు తీసుకోవాలని,


kmm2.jpg

బీటీపీఎస్‌ ప్లాంట్‌తో కాలుష్యం వెదజల్లుతుండటం కారణంగా ప్రజలు స్థానికులు అనేక రోగాల బారిన పడుతున్నారని, హెల్త్‌ క్యాంపులు నిర్వహించి కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కల్టెకర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న, ఎస్‌ఈ రాంప్రసాద్‌, మణుగూరు తహసీల్దార్‌ అద్దంకి నరేష్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో వెంకటేశ్వరరావు, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు రాంబాబు, గౌతమి, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..

4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 29 , 2025 | 12:56 PM