Share News

State Revenue: 4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:01 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లో రాష్ట్ర రాబడులు రూ.74,955 కోట్లకు చేరాయి. బడ్జెట్‌లో అంచనా వేసిన మొత్తం రాబడులు రూ.2,84,837 కోట్లలో ఇది 26.32 శాతం.

State Revenue: 4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు

  • అన్ని రకాల వ్యయాలు రూ.68,823 కోట్లు

  • ‘కాగ్‌’ జూలై నెల నివేదిక విడుదల

హైదరాబాద్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లో రాష్ట్ర రాబడులు రూ.74,955 కోట్లకు చేరాయి. బడ్జెట్‌లో అంచనా వేసిన మొత్తం రాబడులు రూ.2,84,837 కోట్లలో ఇది 26.32 శాతం. గత ఏడాది ఇదే కాలానికి సమకూరిన 26.01 శాతం కంటే 0.31 శాతం మేర రాబడులు పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) గురువారం జూలై నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు రూ.74,955 కోట్లు సమకూరినట్లు వెల్లడించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అప్పుల ద్వారానే రూ.24,669 కోట్లు సమకూరాయి. అంటే ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.54,009 కోట్లలో జూలై నాటికి 45.68 శాతం (రూ.24,669 కోట్లు) మేర అప్పులను తీసేసుకుంది.


ఇది కాకుండా పన్నుల రూపంలో రూ.48,145 కోట్లు, పన్నేతర రాబడి రూ.1,334 కోట్లు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల ద్వారా రూ.790 కోట్లు సమకూరాయి. వస్తు సేవల పన్ను(జీఎ్‌సటీ) రూ.16,882 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,067 కోట్లు, అమ్మకం పన్ను కింద రూ.11,368 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాల ద్వారా రూ.6,347 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.5,899 కోట్లు వచ్చాయి. కాగా, జూలై నాటికి ప్రభుత్వం అన్ని పద్దుల కింద రూ.68,823 కోట్లు వ్యయం చేసింది. ఇందులో పథకాల కోసం రూ.24,176 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.9,355 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాలకు రూ.15,961 కోట్లు, పెన్షన్ల కోసం రూ.6,149 కోట్లు, సబ్సిడీలకు రూ.7,191 కోట్లు ఖర్చు చేసింది.

Updated Date - Aug 29 , 2025 | 05:01 AM