Gold Prices on Aug 29: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Aug 29 , 2025 | 06:48 AM
ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో దేశంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. వరుసగా మూడో రోజూ బంగారం ధరలు పెరిగాయి. మరి నేడు వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: పండుగ సీజన్ కావడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా నేడు మరోసారి పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఈ వారంలో బంగారం ధర పెరగడం ఇది మూడోసారి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్నటితో పోలిస్తే నేడు (August 29, 2025) 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,02,610కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా కాస్త పెరిగి రూ.94,060కు చేరుకుంది. ఇక 18 క్యారెట్‌ల బంగారం ధర రూ.76,960కు ఎగబాకింది. ఇక కిలో వెండి ధర కాస్త తగ్గి రూ.1,19,900కు చేరుకుంది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.37,910గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం స్పాట్ రేట్ 3,400 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విడుదల చేయనున్న గణాంకాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది.
వివిధ భారతీయ నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే,22కే,18కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,02,610; ₹94,060; ₹77,760
ముంబయి: ₹1,02,610; ₹94,060; ₹76,960
ఢిల్లీ: ₹1,02,760; ₹94,210; ₹77,090
కోల్‌కతా: ₹1,02,610; ₹94,060; ₹76,960
బెంగళూరు: ₹1,02,610; ₹94,060; ₹76,960
హైదరాబాద్: ₹1,02,610; ₹94,060; ₹76,960
కేరళ: ₹1,02,610; ₹94,060; ₹76,960
పుణె: ₹1,02,610; ₹94,060; ₹76,960
వడోదరా: ₹1,02,660; ₹94,110; ₹77,000
అహ్మదాబాద్: ₹1,02,660; ₹94,110; ₹77,000
వివిధ నగరాల్లోని వెండి ధరలు
చెన్నై: ₹1,29,900
ముంబయి: ₹1,19,900
ఢిల్లీ: ₹1,19,900
కోల్‌కతా: ₹1,19,900
బెంగళూరు: ₹1,19,900
హైదరాబాద్: ₹1,29,900
కేరళ: ₹1,29,900
పుణె: ₹1,19,900
వడోదరా: ₹1,19,900
అహ్మదాబాద్: ₹1,19,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
రష్యా చమురు దిగుమతులతో ప్రయోజనం కొంతే
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి