Russia Oil Imports: రష్యా చమురు దిగుమతులతో ప్రయోజనం కొంతే
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:45 AM
డిస్కౌంట్ ధరకు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురుతో భారత్‌కు వార్షిక ప్రయోజనం కేవలం 250 కోట్ల డాలర్లేనని (సుమారు రూ.21,875 కోట్లు), దేశ జీడీపీలో 0.6 శాతానికి సమానమని బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎ్‌సఏ...
వార్షిక లబ్ది 250 కోట్ల డాలర్లే..
గత అంచనాల్లో పదో వంతే..
వెల్లడించిన సీఎల్‌ఎ్‌సఏ నివేదిక
న్యూఢిల్లీ: డిస్కౌంట్ ధరకు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురుతో భారత్‌కు వార్షిక ప్రయోజనం కేవలం 250 కోట్ల డాలర్లేనని (సుమారు రూ.21,875 కోట్లు), దేశ జీడీపీలో 0.6 శాతానికి సమానమని బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎ్‌సఏ గురువారం విడుదల చేసిన అధ్యయన నివేదికలో వెల్లడించింది. గతంలో పలు మీడియా కథనాలు అంచనా వేసిన 1,000-2,500 కోట్ల డాలర్ల (రూ.87,500-2,18,750 కోట్లు) స్థాయి భారీ లబ్దితో పోలిస్తే చాలా తక్కువని పేర్కొంది. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు. వినియోగదారు కూడా. రష్యా నుంచి దిగుమతిని నిలిపివేస్తే, భారత్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిమిత ప్రత్యామ్నాయాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు అనూహ్యంగా పెరిగాయి. ఈ యుద్ధానికి ముందు భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం ఒక శాతం కాగా.. ప్రస్తుతం అది దాదాపు 40 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత్ రోజుకు సగటున 54 లక్షల పీపాల ముడి చమురును దిగుమతి చేసుకోగా.. అందులో రష్యా వాటా 18 లక్షల పీపాలుగా (36 శాతం) నమోదైంది. సౌదీ అరేబియా వాటా 14 శాతం, ఇరాక్ వాటా 20 శాతం, యూఏఈ వాటా 9 శాతం, అమెరికా వాటా 4 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి