‘గూడెం’ బరిలో సీపీఐ
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:20 PM
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీకి సిద్దమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ మధ్య మున్సిపాలిటీల్లో మాత్రం పొత్తులు పొసగలేదు.
టీడీపీతో కలిసి 60డివిజన్లలో పోటీకి సై
జాబితా విడుదల చేసిన జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా
కొత్తగూడెం: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ మధ్య మున్సిపాలిటీల్లో పొత్తులు పొసగలేదు. భిన్న రాజకీయాలకు వేదికైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం(Kothagudem) మున్సిపాలిటీలో స్నేహబంధానికి బీటలు వారినట్టేనన్న చర్చ జరుగుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పొత్తుల కోసం ఇరుపార్టీల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చివరకు సీపీఐ టీడీపీతో కలిసి 60డివిజన్లలో పోటీకి సై అంటూ సోమవారం రాత్రి స్పష్టత ఇచ్చింది. మొత్తం 60డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లతో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా జాబితాను విడుదల చేశారు.
ఇందులో 56 డివిజన్లలో తమ పార్టీ పోటీ చేస్తోందని, మరో 4చోట్ల తమ మిత్రపక్షమైన టీడీపీ అభ్యర్థులు బరిలో ఉంటారని పేర్కొన్నారు. అయితే ఇక్కడ టీడీపీ బీఫాం ఇవ్వకపోతుండటంతో ఆ పార్టీ అభ్యర్థులు సీపీఐ బీ ఫాంపై పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నామినేషన్ల ఉపసంహరణ సమయానికి కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ దోస్తీపై ఓ స్పష్టత రావడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు
Read Latest Telangana News and National News