తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణం
ABN , Publish Date - Sep 24 , 2026 | 08:03 AM
మాదక ద్రవ్యాల నియంత్రణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పురస్కారం సాధించిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్య నిరోధక విభాగాల మూడో జాతీయ సదస్సులో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అత్యుత్తమ పురస్కారాన్ని అందుకోవడం తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.
ఈగల్ ఫోర్స్‌కు జాతీయ పురస్కారంపై సీఎం అభినందన
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల నియంత్రణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పురస్కారం సాధించిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్య నిరోధక విభాగాల మూడో జాతీయ సదస్సులో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అత్యుత్తమ పురస్కారాన్ని అందుకోవడం తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఈ జాతీయ గుర్తింపు నిదర్శమన్నారు. 2029 డిసెంబరు నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే దిశగా ఈగల్ ఫోర్స్ మరింత దృఢ సంకల్పంతో పనిచేయాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ బారి యువతను నుంచి కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగాస్వామ్యులు కావాలని సీఎం పిలుపునిచ్చారు. డ్రగ్స్ విక్రయం, వినియోగంపై ఎలాంటి సమాచారమున్నా సంబంధిత అధికారులకు అందించాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ ముందుండాలన్నారు.