Share News

డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

ABN , Publish Date - Jul 11 , 2026 | 07:43 PM

డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఏడాదిలో ఏకంగా ఏడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
Telangana Eagle Force

హైదరాబాద్, జులై 11 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ (Telangana Eagle Force) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఏడాదిలో ఏకంగా ఏడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణను డ్రగ్స్ ట్రాన్సిట్ హబ్‌గా మార్చే ప్రయత్నాలకు చెక్ పెట్టారు. ఈగల్ అధికారులు, ఇంటెలిజెన్స్‌తో దేశవ్యాప్తంగా వరుసగా భారీగా డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. రాంచీలో 500 కిలోలు, ఒడిశాలో 500 కేజీలు, తాజాగా 385 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడు రోజుల నిఘాతో డ్రగ్స్ రవాణా ముఠా ఆగడాలను ఆటకట్టించారు.


ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో 385 కేజీల గంజాయిని ఈగల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏడు రోజుల పాటు నిఘా ఉంచి డ్రగ్స్ రవాణా ముఠాను ట్రాక్ చేశారు. ఒడిశాలోని జయ్‌పూర్ సమీపంలోని దేవఘాటి నుంచి బయలుదేరిన గంజాయి లోడ్‌ను నిరంతరం ఫాలో అయ్యారు. కోల్‌కతా, ముంబై జాతీయ రహదారిపై గంజాయి వాహనాన్ని ఎన్సీబీ రాయ్‌పూర్ బృందం అడ్డుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్‌కు తరలిస్తున్న గంజాయిని గమ్యానికి చేరకముందే స్వాధీనం చేసుకున్నారు.


ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్ మహదేవ్ భీల్‌ను అరెస్ట్‌ చేశారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఎన్సీబీ అధికారులు ఆపరేషన్ విజయవంతం చేశారు. రాష్ట్ర సరిహద్దులు దాటి డ్రగ్స్ మాఫియాపై ఈగల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జాతీయ స్థాయి డ్రగ్స్ వ్యతిరేక పోరులో కీలక శక్తిగా ఈగల్ అధికారులు మారారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో మరింత దూకుడుగా ఈగల్ అధికారులు చర్యలు చేపట్టారు. డ్రగ్స్‌పై సమాచారం ఉంటే వెంటనే 1908 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఈగల్ అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్‌ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 11 , 2026 | 08:00 PM