Share News

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:26 PM

డ్రగ్స్ నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చడంలో మీడియా కీలక భాగస్వామిగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో నిరంతర అవగాహన కల్పించడంలో మీడియా ముందుండాలని పేర్కొన్నారు.

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్
Telangana Governor Shiv Pratap Shukla

హనుమకొండ, జులై 9 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చడంలో మీడియా కీలక భాగస్వామిగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Telangana Governor Shiv Pratap Shukla) సూచించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో నిరంతర అవగాహన కల్పించడంలో మీడియా ముందుండాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని, ప్రతి గ్రామాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పుకొచ్చారు. ఈరోజు (గురువారం) హనుమకొండలో గవర్నర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడారు.


మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని గవర్నర్ సూచించారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా చైతన్యానికి సంబంధించిన సానుకూల అంశాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా బాధ్యత ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. ప్రజల్లో బాధ్యత, సామాజిక చైతన్యం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంచేందుకు మీడియా నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు.


మత్తు రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మీడియా సంపూర్ణ సహకారం అందించాలని గవర్నర్ కోరారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో మీడియా ఒక శక్తివంతమైన వేదికగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం, ప్రజలు, మీడియా సమష్టిగా కృషి చేసినప్పుడే డ్రగ్స్ రహిత భారత్ – డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హైకమిషనర్ భేటీ

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 06:05 PM