Share News

బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి.. భూగర్భ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:10 PM

బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి కీలక అడుగులు వేసింది. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తోంది.

బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి.. భూగర్భ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
Singareni

హైదరాబాద్, జులై 11 (ఆంధ్రజ్యోతి): బొగ్గు వినియోగంలో నూతన సాంకేతికతలను అందిపుచ్చుకునే దిశగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కీలక అడుగులు వేస్తోంది. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (Underground Coal Gasification - UCG) రంగంలోకి ప్రవేశించేందుకు ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టును బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


సింగరేణి అధికారులు రామగుండం, బెల్లంపల్లి ప్రాంతాల్లో ఐదు లోతైన బొగ్గు బ్లాక్‌లను గుర్తించారు. ఈ బ్లాక్‌లలో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌కు అనుకూల పరిస్థితులను పరిశీలించనున్నారు. ముఖ్యంగా భీమారం, చెన్నూరు సౌత్, నైనీ ప్రాంతాల్లో గ్యాసిఫికేషన్ అవకాశాలపై అధ్యయనాలు చేపట్టనున్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అమలు విధానాలను అధ్యయనం చేసేందుకు సింగరేణి ప్రత్యేక బృందం ఇతర ప్రాంతాల్లో పర్యటించనుంది. అలాగే అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రత్యామ్నాయ అవకాశాలను కూడా పరిశీలించనుంది. ఈ ప్రాజెక్టు అమల్లో కేంద్ర ప్రభుత్వం అందించే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) వినియోగంపై సింగరేణి దృష్టి సారిస్తోంది. ప్రాజెక్టు సాంకేతికంగా విజయవంతం కావడానికి సీఎంఐఎఫ్‌ఆర్ (CSIR-CIMFR) శాస్త్రవేత్తల సాంకేతిక సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్‌ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 11 , 2026 | 05:25 PM