Home » Singareni Collieries
2024-2025 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 69.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. తద్వారా 40 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 35 శాతం బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బొగ్గు గనులతో సింగరేణికి సిరుల పంట పండుతున్నా.. ఓపెన్‌కాస్టు తవ్వకాల వల్ల సమీప గ్రామాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.
భవిష్యత్తులో బొగ్గు నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో సింగరేణి ఇతర ఖనిజాల ఉత్పత్తిలోకి అడుగుపెడుతోంది. 4000–5000 మెగావాట్ల సౌర విద్యుత్ లక్ష్యాన్ని కూడా సంస్థ ముందుకు తీసుకెళ్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కీలకమైన రెండు డైరెకర్ పోస్టుల నియామకం చేపట్టింది. డైరెక్టర్ ఆపరేషన్‌గా ఎల్‌వి. సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్‌గా కొప్పుల వెంకటేశ్వర్లును నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ‘సింగరేణిని బతికిద్దాం.. మనం బతుకుదాం’ అని ఆ సంస్థ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
మేజర్ మినరల్స్‌కు సంబంధించిన గనుల వేలంపై పీడముడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరేళ్లుగా ఎలాంటి స్పందనా లేదు. ఏదైనా మేజర్ మినరల్‌కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి గడిచిన పదేళ్లలో ఎంతో చేశామని, భవిష్యత్తులోనూ మరెంతో చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
సింగరేణిలో పనిచేస్తూ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
సింగరేణి ఓపెన్‌కా్‌స్ట ప్రాజెక్టులో ప్రమాదం సంభవించింది. పైపులైన్ లీకేజీ మరమ్మతు చేస్తున్న ఇద్దరు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు కా ర్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం బుధవారం ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.