Singareni Bonus Announcement: నేడు ఉత్కంఠకు తెర.. బోనస్ ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం..
ABN , Publish Date - Sep 22 , 2025 | 09:01 AM
2024-2025 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 69.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. తద్వారా 40 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 35 శాతం బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సింగరేణి కార్మికులకు ఇచ్చే బోనస్‌పై ఉత్కంఠ వీడనుంది. నేడు(సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించనుంది. లాభాల నుంచి 35 శాతం బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత సంవత్సరం 33 శాతం వాటాను కార్మికులకు పంచారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 2,412 కోట్ల రూపాయల లాభాలను గడించింది. ఈ లాభాల్లో 33 శాతాన్ని కార్మికులకు వాటా కింద పంచారు. 795 కోట్ల రూపాయలు పంపిణీ అయింది.
గత సంవత్సరం దసరా సందర్భంగా కార్మికులకు బోనస్‌గా 1.90 లక్షల రూపాయలు వచ్చింది. ఈ సారి లాభాలు పెరగటంతో గతేడాది ఇచ్చిన దానికంటే ఎక్కువ బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 69.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. తద్వారా 40 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 35 శాతం బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే బోనస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో పాటు కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో సోమవారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బోనస్ ఎంత అనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా, కోల్ ఇండియా యాజమాన్యం బోనస్ మొత్తాన్ని ప్రతీ సంవత్సరం పెంచుకుంటూ వెళుతోంది. ఈ సారి బోనస్ లక్ష రూపాయల వరకు చెల్లించే అవకాశం కనిపిస్తోంది. అయితే, కార్మికులు మాత్రం లక్షకుపైనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రియురాలిని చంపి.. శవంతో సెల్ఫీ దిగిన ప్రియుడు..
పబ్లిక్‌లో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ముద్దులు పెట్టుకుంటూ..