Share News

అమెరికాపై ఇరాన్ ఆగ్రహం.. తీవ్రస్థాయిలో మండిపడిన ఖమేనీ

ABN , Publish Date - Jul 19 , 2026 | 08:03 PM

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది.

అమెరికాపై ఇరాన్ ఆగ్రహం.. తీవ్రస్థాయిలో మండిపడిన ఖమేనీ

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడిపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికాను 'క్రిమినల్ దేశం' అని, 'గ్రేట్ సాతాన్' అని విమర్శించారు.


ఈ సందర్భంగా మొజ్తబా ఖమేనీ తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఇంతటి గొప్ప ప్రజాస్పందన ప్రాంతీయ రాజకీయం పరంగా కొత్త మార్పులకు తెరతీసిందని ఆయన అన్నారు. అమెరికా ఆధిపత్యానికి గండికొట్టేందుకు ఇదే నిదర్శనమని ఖమేనీ చెప్పుకొచ్చారు.


కాగా.. జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల బలగాల దాడిలో అమెరికాకు చెందిన సైనికులు ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు అమెరికా ఇటీవల ధ్రువీకరించింది. దీనికి అమెరికా.. ఐఆర్‌జీసీ స్థావరాలు సహా వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్ నిల్వల కేంద్రాలే లక్ష్యంగా ప్రతిదాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్‌కామ్) తెలిపింది. తాజా దాడుల్లో నిర్మాణంలో ఉన్న ఓ అణు విద్యుత్‌ కేంద్రంపై అమెరికా దాడిచేసిందని ఇరాన్ ఆరోపించింది. అయితే.. ఈ ఆరోపణలపై అమెరికా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.


ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 19 , 2026 | 08:03 PM