Home » US Iran War
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హోర్ముజ్‌ను మూసివేస్తే.. ఇరాన్ పూర్తిగా నాశనం చేస్తామన్నారు.
ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజా ఒప్పందంతో.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి అణు దాడి ప్రమాదం తప్పిందన్న ట్రంప్.. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో జరిపిన సంభాషణను వెల్లడించారు.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అధికారిక సంతకాలకు ముందే డిజిటల్‌గా పూర్తైందని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు. అయితే ఇరాన్ ఒప్పంద నిబంధనల్ని అమలు చేశాకే ఆంక్షల సడలింపులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల ఒమన్ తీర ప్రాంతంలో చమురు నౌకలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా భారతీయులు ఉన్న నౌకపై దాడి జరిగిందని, పలువురు మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది.