దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం... 14 మంది మృతి
ABN , Publish Date - Apr 28 , 2026 | 07:36 AM
ఆఫ్రికా దేశమైన దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని జుబా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు.
ఆఫ్రికా దేశమైన దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని జుబా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని అధికారులు తెలిపారు (South Sudan plane crash).
ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుంది. దీంతో ప్రయాణికుల శరీరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది స్థానికులు కాగా, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విమానం యెయి (Yei) ప్రాంతం నుంచి జుబాకు వెళ్తుండగా మార్గమధ్యంలో కుప్పకూలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు (Juba plane crash 2026).
ఈ ప్రమాదంలో విమానంలోని 13 మంది ప్రయాణికులు, పైలట్ సహా మొత్తం 14 మంది మృతి చెందారు (14 killed plane crash Africa). రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్చలు ప్రారంభించాయి. మృతుల్లో 12 మంది దక్షిణ సూడానీయులు, ఇద్దరు కెన్యా దేశస్థులు ఉన్నారు. కాగా, ఇటీవలి కాలంలో సూడాన్‌లో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..