Share News

MP R. Krishnaiah: రిజర్వేషన్ల సాధనకు త్వరలో బీసీ రథయాత్ర..

ABN , Publish Date - Oct 29 , 2025 | 08:52 AM

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం త్వరలో బీసీ రథయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అమలును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయకపోతే నవంబరు రెండవ వారంలో రథయాత్ర ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు.

MP R. Krishnaiah: రిజర్వేషన్ల సాధనకు త్వరలో బీసీ రథయాత్ర..

హైదరాబాద్: స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం త్వరలో బీసీ రథయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య(MP R. Krishnaiah) తెలిపారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అమలును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయకపోతే నవంబరు రెండవ వారంలో రథయాత్ర ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు.


city5.2.jpg

విద్యార్థుల ఫీజు బకాయిలపై సీఎంకు కృష్ణయ్య లేఖ

పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్‌, పీజీ, డిగ్రీ కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఎంపీ ఆర్‌. కృష్ణయ్య మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం తగదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో భారీగా తగ్గుదల

భయపెడుతున్న మొంథా తుఫాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 29 , 2025 | 08:52 AM