Share News

Gold Rates on Oct 29: బంగారం ధరల్లో భారీగా తగ్గుదల

ABN , Publish Date - Oct 29 , 2025 | 06:46 AM

బంగారం రేట్లు భారీగా దిగొచ్చాయి. ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర రూ.1.20 లక్షల మార్కును చేరుకుంది. మరి వివిధ నగరాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold Rates on Oct 29: బంగారం ధరల్లో భారీగా తగ్గుదల
Gold, Silver prices in india october 29

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరల్లో భారీ స్థాయిలో కోత పడింది. పది రోజుల వ్యవధిలోనే 10 శాతం మేర తగ్గాయి. ధన త్రయోదశి సమయంలో రూ.1.30 లక్షల మార్కు దాటిన పసిడి నేడు రూ.1.20 లక్షల వద్ద తచ్చాడుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,810గా ఉంది. 22 క్యారెట్ బంగారం ధర రూ.1,10,740కు దిగొచ్చింది. వెండి ధరల్లో కూడా కోత పడింది. కిలో వెండి రూ.1,50,900గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రేటు రూ.1,20,810గా ఉంది. ఆర్నమెంటల్ బంగారం రేటు రూ.1,10,740కు దిగొచ్చింది (Gold, Silver Prices on October 29.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్ 24 క్యారెట్ బంగారం 3941 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్స్ వెండి ధర కూడా 47 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఈ వారంలో వెండి ధరలు 6 శాతం మేర పతనమయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణ, ధరల్లో దిద్దుబాటు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగవ్వడం వంటివన్నీ బంగారం, వెండి ధరల పరుగుకు బ్రేకులు వేస్తున్నాయి. ధరల్లో మరో 5-10 శాతం మేర కోత పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవీ

  • చెన్నై: ₹1,20,810; ₹1,10,740; ₹91,990

  • ముంబై: ₹1,20,810; ₹1,10,740; ₹90,610

  • ఢిల్లీ: ₹1,20,960; ₹1,10,890; ₹90,760

  • కోల్‌కతా: ₹1,20,810; ₹1,10,740; ₹90,610

  • బెంగళూరు: ₹1,20,810; ₹1,10,740; ₹90,610

  • హైదరాబాద్: ₹1,20,810; ₹1,10,740; ₹90,610

  • కేరళ: ₹1,20,810; ₹1,10,740; ₹90,610

  • పూణె: ₹1,20,810; ₹1,10,740; ₹90,610

  • వడోదరా: ₹1,20,860; ₹1,10,790; ₹90,660

  • అహ్మదాబాద్: ₹1,20,860; ₹1,10,790; ₹90,660

కిలో వెండి ధరలు ఇలా..

  • చెన్నై: ₹1,64,900

  • ముంబై: ₹1,50,900

  • ఢిల్లీ: ₹1,50,900

  • కోల్‌కతా: ₹1,50,900

  • బెంగళూరు: ₹1,51,900

  • హైదరాబాద్: ₹1,64,900

  • కేరళ: ₹1,64,900

  • పుణే: ₹1,50,900

  • వడోదరా: ₹1,50,900

  • అహ్మదాబాద్: ₹1,50,900


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

ఇవీ చదవండి:

Indias IT Market: 2030 నాటికి రూ.35.32 లక్షల కోట్లు

Apples Market Value: యాపిల్‌ 4 లక్షల కోట్ల డాలర్లు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి


Updated Date - Oct 29 , 2025 | 07:20 AM