Apples Market Value: యాపిల్ 4 లక్షల కోట్ల డాలర్లు
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:53 AM
ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ మార్కెట్ విలువ తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల (నాలుగు లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది. ఈ ఏడాది సెప్టెంబరులో విడుదల చేసిన ఐఫోన్ 17 మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా...
ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ మార్కెట్ విలువ తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల (నాలుగు లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది. ఈ ఏడాది సెప్టెంబరులో విడుదల చేసిన ఐఫోన్ 17 మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా జోరుగా అమ్ముడవుతుడంటంతో కంపెనీ షేరు గడిచిన 3 నెలల్లో 25 శాతం మేర పుంజుకుంది. పైగా ఈ గురువారం కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. కంపెనీ పనితీరుపై ఆశాజనక అంచనాలతో మంగళవారం షేరు ధర మరింత పెరిగి 269.87 డాలర్ల వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేసింది. యాపిల్‌తోపాటు మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం 4 లక్షల కోట్ల డాలర్లు దాటింది. అయితే, ఈ జూలైలోనూ మైక్రోసాఫ్ట్ ఈ మార్క్‌ను తాకింది. కాగా, ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా 4.6 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది.
నోకియాలో ఎన్‌విడియా 100 కోట్ల డాలర్ల పెట్టుబడి టెలికాం నెట్‌వర్క్, పరికరాల తయారీ దిగ్గజం నోకియాలో ఎన్‌విడియా 100 కోట్ల డాలర్ల (రూ.8,829 కోట్లు) పెట్టుబడులు పెడుతోంది. ఇందుకు గాను ఎన్‌విడియాకు నోకి యా 16.6 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనుంది. ఈ డీల్ నేపథ్యంలో నోకియా షేరు ఏకంగా 18ు పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
Read Latest AP News And Telugu News