Cyclone Montha Konaseema: ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:05 AM
దాదాపు 6 వేల మందిని తరలించేందుకు 120 పునరావాసు కేంద్రాలు ఏర్పాటు చేవారు. అమలాపురం, సఖినేటిపల్లిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.
రాజమండ్రి, అక్టోబర్ 28: మొంథా తుపాన్ (Cyclone Montha) హెచ్చరికలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలను తీవ్రంగా వణికిస్తున్నాయి. 1996 నాటి పెను తుపాన్‌ను గుర్తుచేసుకొని కోనసీమ వాసులు భయాందోళన చెందుతున్న పరిస్థితి. జిల్లాలోని సముద్ర తీరంలో ఉన్న 34 గ్రామాలు సహా కచ్చా ఇల్లు, పూరి గుడిసెల్లో ఉన్నవారిని తుపాన్ పునరావాస కేంద్రాలకు అధికార యంత్రాంగం తరలిస్తోంది. దాదాపు 6 వేల మందిని తరలించేందుకు 120 పునరావాసు కేంద్రాలు ఏర్పాటు చేవారు. అమలాపురం, సఖినేటిపల్లిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.
ఎక్కడైనా ఘటన జరిగితే 30 నిమిషాల్లో చేరుకునేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కాట్రేనికోన, అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో తీర ప్రాంత మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద బోట్లను నిలిపివేశారు మత్స్యకారులు. మలికిపురం మండలం కేశనపల్లి తుపాన్ షెల్టర్‌లో మత్స్యకారులంతా ఆశ్రయం పొందుతున్నారు. తుపాన్ సహాయక చర్యలను ప్రత్యేక అధికారి వి.విజయ రామరాజు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పునరావస కేంద్రాల్లో ఆహారం తయారీ, వసతి, వైద్యశిబిరం తదితర ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
రైలు, విమాన సర్వీసులకు బ్రేక్
Read Latest AP News And Telugu News