Share News

Lokesh Speaks With AP MLAs: మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:01 PM

మొంథా తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో ఈరోజు చాలా ముఖ్యమని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ సూచించారు.

Lokesh Speaks With AP MLAs: మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
Lokesh Speaks With AP MLAs

అమరావతి, అక్టోబర్ 28: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొంథా తుపాను (Cyclone Montha) తీవ్రతపై మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఆరా తీశారు. వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి క్షేతస్థాయి పరిస్థితులను వాకబు చేశారు. ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో మంత్రి మాట్లాడారు. అలాగే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో ఫోన్లో మాట్లాడి తుపాను పరిస్థితులపై ఆరా తీశారు.


మొంథా తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో ఈరోజు చాలా ముఖ్యమని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించాలని శాసనసభ్యులకు సూచించారు. సంక్షోభ సమయంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. డ్రెయిన్లు పొంగి ప్రవహించకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు లోకేష్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వివరించారు. అలర్ట్స్ ట్రాకింగ్ మెకానిజం ద్వారా ప్రతి రెండు గంటలకోసారి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

గంటకు 12 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మొంథా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 01:33 PM