Share News

Atchannaidu On Cyclone Montha: మొంథా తుపాన్.. రైతులను ఉద్దేశించి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:51 AM

ఈసారి కూడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నష్ట నివారణ చర్యలను చాలా పకడ్బంధీగా ఇప్పటికే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.

Atchannaidu On Cyclone Montha: మొంథా తుపాన్.. రైతులను ఉద్దేశించి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
Atchannaidu On Cyclone Montha

అమరావతి, అక్టోబర్ 28: మొంథా తుపాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్న నేపథ్యంలో రైతులను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) కీలక ప్రకటన చేశారు. తుపాన్ కారణంగా రైతులెవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. తీవ్ర ప్రకృతి విపత్తుల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నాయకత్వంలో ఇంతకంటే పెద్ద ఉపద్రవాలను ముందస్తు ప్రణాళికతో.. పకడ్బందీ ఏర్పాట్లతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా విజయవంతంగా అధిగమించగలిగామని గుర్తుచేశారు. ఈసారి కూడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. నష్ట నివారణ చర్యలను చాలా పకడ్బంధీగా ఇప్పటికే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.


వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలను, అధికారులను, క్రింది స్థాయి సిబ్బంది అంతా కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల అంచనా, పంట నష్ట నివేదికలను ప్రాథమికంగా సేకరించామని చెప్పారు. తుపాను తీవ్రత వలన అధికంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామన్నారు. ఆయా ముంపు ప్రాంతాలలో తీసుకోవలసిన ముందస్తు నష్ట నివారణ చర్యలను, జాగ్రత్తలను అధికారుల ద్వారా రైతులకు చేరవేశామని మంత్రి అన్నారు.


వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా ఆస్తి నష్ట నివారణను ఎలా తగ్గించుకోవచ్చో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సోషల్ మీడియా ద్వారా 24 x7 రైతులకు తెలియజేస్తున్నామని అన్నారు. అన్ని నష్ట నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ తుపాను అనంతరం ఏదైనా ఇబ్బంది వస్తే.. ప్రతి ఎకరాలో పంట నష్టాన్ని లెక్కించి నష్ట పోయిన ప్రతి రైతును పూర్తిగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. మత్స్యకారులు అందరినీ పూర్తిగా అప్రమత్తం చేశామన్నారు. తుపాను తీవ్రత దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా తగు చర్యలు తీసుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

కేడర్ నుంచి లీడర్ వరకు కదలి రండి.. టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 03:14 PM