Cyclone Montha Nellore Rains: ఎడతెరపిలేని వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
ABN , Publish Date - Oct 28 , 2025 | 09:20 AM
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. గ్రామాల్లోనే ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగంతో కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
నెల్లూరు, అక్టోబర్ 28: మొంథా తుపాను (Cyclone Montha) రాష్ట్రాన్ని వణికిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. మొంథా తుపానుతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలకు డ్యాంలు, నదులు, రిజర్వాయర్లు, వాగులు, వంకలు, కాలువలు నిండుకుండుల్లా మారాయి. వర్షాలకు వెయ్యి హెక్టర్లలో వరి, వేరుశెనగ, మినుము, పెసర, కూరగాయల పంటలు నీటమునిగాయి. సముద్రంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరంలో పలు చోట్ల 50 అడుగుల నుంచి 100 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చిన పరిస్థితి. మర్రిపాడు మండలం రామానాయుడుపల్లెలో ఈతకెళ్లిన 13 ఏళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు.
ఇక వర్షాల నేపథ్యంలో ఈరోజు (మంగళవారం) జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. గ్రామాల్లోనే ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగంతో కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. వర్షాలకు వాగులు, వంకలతో పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. ఆయా గ్రామాలకు రేషన్ బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే కండలేరు కింది భాగంలో గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణపట్నం, జువ్వలదిన్నె హార్బర్‌కు వందలాదిగా పెద్దబోట్లు చేరాయి. ఇక ఎంతటి విపత్తునైనా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి...
రైలు, విమాన సర్వీసులకు బ్రేక్
Read Latest AP News And Telugu News