Share News

LIVE UPDATES: వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుఫాన్

ABN , First Publish Date - Oct 29 , 2025 | 06:49 AM

మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ తుఫాన్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్‌ను ఇక్కడ చూడండి.

LIVE UPDATES: వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుఫాన్

Live News & Update

  • Oct 29, 2025 21:03 IST

    ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక

    • ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక జారీ చేసిన రివర్ కన్సర్వేటర్

    • బ్యారేజ్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఇప్పుటికే బ్యారేజీకి లక్ష క్యూసెక్కుల వరద నీరు

    • రేపటికి 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని పేర్కొన్న రివర్ కన్సర్వేటర్

    • ఈ వరద ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారులు

    • ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న అధికారులు

    • బ్యారేజ్ దిగువ భాగాన లంక గ్రామాల ప్రజలు, నది తీర మండలాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు.

  • Oct 29, 2025 20:29 IST

    ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్..

    • వరంగల్ నగరంలో దంచికొడుతున్న వాన

    • పర్వతగిరిలో అత్యధికంగా 34.80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

    • రేపు హనుమకొండ, వరంగల్ జిల్లాలకు రైడ్ అలెర్ట్

    • విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు

    • GWMCలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

    • రాత్రి ఎలా గడుస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు

  • Oct 29, 2025 20:04 IST

    శ్రీశైలం ఘాట్ రోడ్డులో రాకపోకలు పునరుద్ధరణ

    • నంద్యాల : శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో రాకపోకలు పునరుద్ధరణ

    • శ్రీశైలం-దోర్నాల ఘాట్ రోడ్డులో వాహన రాకపోకలను తిరిగి ప్రారంభం

    • చింతల, తుమ్మలబైలు వాగులు ఉప్పొంగడంతో నిన్నటి నుండి రాకపోకలు నిలుపుదల

    • రెండు వాగుల ఉద్ధృతి, వర్షం తగ్గడంతో రాకపోకలు పునప్రారంభం

    • దోర్నాల, శిఖరం చెకోపోస్ట్ వద్ద గంటల తరబడి వేచిఉన్న భక్తులు

    • రాకపోకలు పునప్రారంభం కావడంతో ప్రయాణాలు సాగిస్తున్న వాహనదారులు

  • Oct 29, 2025 19:41 IST

    ప్రాణాలను కాపాడుతున్న డ్రోన్లు..

    • మొంథా తుఫాను సహయక చర్యల్లో భాగంగా పరిస్థితి అంచనా వేసేందుకు డ్రోన్లను వినియోగించిన ప్రభుత్వం.

    • బాపట్ల జిల్లా పర్చూరు వాగులో కొట్టుకుపోతోన్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించిన అధికారులు.

    • వెంటనే అలెర్టు కావడంతో వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని కాపాడిన పోలీసులు.

    • అలాగే లోతట్టు ప్రాంతాలను డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్న పోలీసులు, అధికారులు.

    • ఏమైనా ప్రమాదకర పరిస్థితులుంటే వెంటనే అలెర్ట్ అవుతున్న అధికార యంత్రాంగం.

    • కొన్ని చోట్ల కొట్టుకుపోతున్న పశువులను డ్రోన్ల ద్వారా గుర్తించి ఒడ్డుకు చేర్చిన పోలీసులు.

  • Oct 29, 2025 19:22 IST

    రేపు విద్యాసంస్థలకు సెలవు..

    • భారీ వర్షాల నేపథ్యంలో రేపు సిద్దిపేట జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

    • అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ హైమావతి

  • Oct 29, 2025 18:40 IST

    ఉదయం నుంచి దంచికొడుతున్న వర్షం..

    జనగామలో ఉదయం నుంచి దంచి కొడుతున్న వర్షం

    జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే ప్రధాన రహదారి గానుగుపహాడ్ వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన

    వాహనాల రాకపోకలకు అంతరాయం

  • Oct 29, 2025 18:36 IST

    తుఫాను కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామంలో నీటముడిగిన గృహాలు

    photos-3.jpgphotos-4.jpgphotos-21.jpgphotos-2.jpgphotos.jpg

  • Oct 29, 2025 18:24 IST

    వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుఫాన్

    • అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం.

    • తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.

    • కోస్తాంధ్ర, రాయలసీమ, విదర్భకు భారీ వర్ష సూచన.

  • Oct 29, 2025 17:56 IST

    మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షపాతం

    • ఒంగోలులో 25సెం.మీ., చీమకుర్తిలో 24 సెం.మీ. వర్షపాతం.

    • కందుకూరు, కావలిలో 22, దర్శి, అద్దంకిలో 19సెం.మీ. వర్షపాతం.

    • మార్కాపురంలో 15, పొదిలి, ఆత్మకూరులో 14 సెం.మీ. వర్షపాతం.

    • పోరుమామిళ్లలో 13, బాపట్ల, కారంచేడు, ఎస్.కోటలో 12సెం.మీ.

    • నెల్లూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరులో 10 సెం.మీ. వర్షపాతం.

  • Oct 29, 2025 17:07 IST

    అమరావతి: తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో లోకేష్ టెలికాన్ఫరెన్స్

    • పాల్గొన్న హోంమంత్రి అనిత, సీఎస్ విజయానంద్, ఆర్టీజీఎస్ సెక్రటరీ

    • వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: లోకేష్

    • రోడ్లపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు చర్యలు చేపట్టాలి

    • తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వందశాతం విద్యుత్‌ను పునరుద్ధరించాలి

    • త్వరితగతిన పంటనష్టం అంచనాలను రూపొందించాలి: లోకేష్

    • ప్రాణ నష్టం, దెబ్బతిన్న నిర్మాణాలను నివేదించాలి: లోకేష్

    • అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలి: మంత్రి లోకేష్

  • Oct 29, 2025 17:06 IST

    ప్రయాణికులకు బిగ్ అలర్ట్..

    • మొంథా తుఫాన్ దృష్ట్యా ఇవాళ 49, రేపు 6 రైళ్లు రద్దు: ద.మ.రైల్వే

    • ఇవాళ 15 రైళ్లు, రేపు 12 రైళ్లు దారి మళ్లింపు: ద.మ.రైల్వే

  • Oct 29, 2025 16:33 IST

    వరద నీటిలో పడి మహిళ మృతి..

    • మహబూబాబాద్ డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ శివారు సత్యతండాలో విషాదం

    • వరద నీటిలో పడి రోషమ్మ అనే మహిళ మృతి

    • రేకులతో తాత్కాలికంగా నిర్మించుకున్న ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి జారిపడి నీటిలోనే మృతి చెందిన మహిళ

  • Oct 29, 2025 15:11 IST

    వరంగల్‌లో కుండపోత వాన

    • వరంగల్ నగరంలో కుండపోత వాన

    • మూడు గంటల నుంచి నాన్ స్టాప్‌గా దంచికొడుతున్న వర్షం

    • భయాందోళనలో స్థానికులు

  • Oct 29, 2025 14:31 IST

    సీఎం చంద్రబాబు ఏరియల్‌ వ్యూ

    • తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ వ్యూ

    • చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు, నాగాయలంక,.. కాట్రేనికోన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లిలో సీఎం ఏరియల్ సర్వే.

    • కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఫీల్డ్‌ విజిట్ చేయనున్న సీఎం.

    • నీటమునిగిన పంటలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు.

  • Oct 29, 2025 13:45 IST

    తుఫాన్‌ నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్ష

    • వివిధ జిల్లాల్లో నష్టంపై మంత్రి నారా లోకేష్‌ ఆరా

    • నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని ఆదేశం

    • విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై మంత్రి నారా లోకేష్‌ ఆరా

    • క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, నేతలు అందుబాటులో ఉండాలని లోకేష్ ఆదేశం

  • Oct 29, 2025 12:56 IST

    అతి భారీ వర్షాలకు RK బీచ్ రోడ్డు పూర్తిగా జలమయం!

  • Oct 29, 2025 12:51 IST

    సీఎం చంద్రబాబు ఆదేశాలతో తుఫాను బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం

    • తుఫాన్ బాధితుల కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం

    • పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు నగదు సాయాన్ని అందించాలని ఆదేశం

  • Oct 29, 2025 12:46 IST

    తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ వ్యూకు బయల్దేరిన సీఎం చంద్రబాబు

    చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు, నాగాయలంక,..

    కాట్రేనికోన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లిలో సీఎం ఏరియల్ సర్వే

    అమలాపురంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న సీఎం

    కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం చంద్రాబబు ఫీల్డ్ విజిట్

  • Oct 29, 2025 11:23 IST

    ఏపీలో తుఫానులు రావడానికి ప్రధాన కారణాలు ఇవే ..!

  • Oct 29, 2025 11:09 IST

    నంద్యాల: భారీ వర్షంతో చామ కాలువకు వరద ఉధృతి

    • ఫక్కీర్ పేట, సుందరయ్య నగర్‌, సలీంనగర్‌, విశ్వనగర్‌, భగత్‌సింగ్ కాలనీల్లోకి వరద

  • Oct 29, 2025 11:09 IST

    విజయవాడ: భారీ వర్షాలతో దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత

    • ప్రత్యేక దర్శనాలు నిలిపివేత,

  • Oct 29, 2025 11:01 IST

    ప్రకాశం: సంతనూతలపాడు దగ్గర వరదలో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు

    • ఒంగోలు-కర్నూలు రోడ్డును ముంచెత్తిన పేర్నమిట్ట చెరువు వరద

    • విజయవాడ నుంచి తాడిపత్రి వెళ్తున్న ప్రైవేట్ బస్సు

    • 25 మంది ప్రయాణికులను మరో బస్సులో తరలింపు

  • Oct 29, 2025 11:00 IST

    కోనసీమకు తప్పిన తీవ్ర తుఫాన్ ముప్పు

    • స్వల్ప నష్టంతో బయటపడ్డ కోనసీమ జిల్లా

    • జిల్లాలో కూలిన చెట్లు 143, దెబ్బతిన్న గృహాలు 30

    • కోనసీమ జిల్లాలో 5,091 హెక్టార్లలో వరి పంటకు నష్టం

  • Oct 29, 2025 11:00 IST

    రాజమండ్రి: ధవళేశ్వరంలో కూలిన గోడ

    • ఆటోపై కూలిన ప్రహరీ గోడ, ఆటో డ్రైవర్‌కు గాయాలు

    • ధవళేశ్వరం సాయిబాబా గుడి దగ్గర ఘటన

    • అనపర్తి, రాజానగరం, బొమ్మూరు, కడియం మండలాల్లో నేలకొరిగిన చెట్లు

    • అనపర్తి నల్లకాలువ వంతెనపై కూలిన చెట్లు

    • తూర్పు గోదావరి జిల్లాలో 17 మండలాల్లో పంట నష్టం

    • బిక్కవోలు మండలంలో 2,550 హెక్టార్లలో వరి పంటకు తీవ్ర నష్టం

    • రాజానగరం మండలంలో 253 హెక్టార్లు, రంగంపేటలో 326 హెక్టార్లు,..

    • కడియంలో 285 హెక్టార్లలో వరి పంటకు తీవ్ర నష్టం

    • రాజానగరం మండలంలో 28 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం

  • Oct 29, 2025 11:00 IST

    ఆత్మకూరులో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం

    • కర్నూలు- గుంటూరు రోడ్డుపై వరద, రాకపోకలకు అంతరాయం

    • ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వరద ప్రవాహం

  • Oct 29, 2025 10:59 IST

    నంద్యాల: నల్లమల అడవుల్లో కుండపోత వర్షం

    • వరదరాజ స్వామి ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత

    • కొత్తపల్లి వైపు వెళ్లే 30 గ్రామాలకు రాకపోకలు అంతరాయం

    • పూర్తిగా నిండిన సిద్దాపురం చెరువు, రోడ్డుపై పారుతున్న వరద

    • ఆత్మకూరు నుంచి దోర్నాల వెళ్లే రాకపోకలు బంద్

    • దోర్నాల వెళ్లే వాహనాలు నంద్యాల మీదుగా మళ్లింపు

  • Oct 29, 2025 10:59 IST

    నెల్లూరు: సంగం పెన్నా వారధి దగ్గర తప్పిన ముప్పు

    • నదిలో ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన 3 పడవలు

    • భారీ వరదతో తాళ్లు తెంచుకుని పెన్నా నది గట్టున నిలిచిన బోట్లు

    • పెన్నా వారధి గేట్లకు బోట్లు తగలకపోవడంతో తప్పిన ప్రమాదం

  • Oct 29, 2025 10:59 IST

    అమరావతి: విద్యుత్ సరఫరాపై మంత్రి గొట్టిపాటి ఆరా

    • ఉన్నతాధికారులు, సీఎండీలతో మంత్రి గొట్టిపాటి టెలికాన్ఫరెన్స్‌

    • పెట్రోలింగ్‌ చేస్తూ సమస్య లేనిచోట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న అధికారులు

    • కొన్ని చోట్ల పునరుద్ధరణ పనులతో సరఫరాకు సమయం పడుతుందన్న అధికారులు

    • తీవ్రత ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బంది, సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలన్న మంత్రి

    • ఇతర శాఖలతో విద్యుత్ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలి: మంత్రి గొట్టిపాటి

  • Oct 29, 2025 10:32 IST

    ఒంగోలులో ప్రధాన రోడ్లన్నీ జలమయం

    • ప్రకాశం జిల్లాలో 60 పునరావాస కేంద్రాలు

    • 3వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలింపు

    • ప్రకాశం: అర్థవీడు మండలంలో జంపలేరు వాగు ఉధృతి

    • జంపలేరు వాగు ఉధృతికి 6 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

    • గిద్దలూరు మం. వెంకటాపురం దగ్గర ఎనుమలేరు ఉధృతి

    • రాచర్ల మం. చల్లవీడు-ఆకవీడు మధ్య నిలిచిన రాకపోకలు

    • మార్కాపురంలో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

    • గుండ్లకమ్మ ఉధృతికి మార్కాపురం-కంభం రోడ్డులో నిలిచిన రాకపోకలు

  • Oct 29, 2025 10:32 IST

    నంద్యాల: శ్రీశైలం నల్లమల అడవుల్లో భారీ వర్షం

    • ఇష్టకామేశ్వరి ఆలయం దగ్గర వరద ఉధృతి

    • ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం నిలుపుదల

    • ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు నగదు తిరిగి చెల్లింపు

  • Oct 29, 2025 10:06 IST

  • Oct 29, 2025 10:05 IST

  • Oct 29, 2025 10:00 IST

    ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు

    • జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, నిలిచిన రాకపోకలు

    • మనుబోలు మం. గొల్లపాలెంలో పొటేళ్ల వాగు దాటుతూ మహిళ జయమ్మ గల్లంతు

    • జిల్లాలో అత్యధికంగా కావలిలో 23.7 సెం.మీ. వర్షపాతం నమోదు

    • సింగరాయకొండలో 18.7, దగదర్తిలో 18.2, ఉలవపాడులో 17,..

    • కందుకూరులో 16.8, కొడవలూరులో 15.2, కలిగిరిలో 14.4 సెం.మీ వర్షపాతం

  • Oct 29, 2025 09:59 IST

    ప్రకాశం: ఒంగోలులో 17.7 సెం.మీ. వర్షపాతం, పొన్నలూరు 17.6, టంగుటూరు 17.2..

    • కొత్తపట్నం 16.8, కొండపి16.5, సింగరాయకొండ 16.3, నాగులుప్పలపాడు 14.7,..

    • చీమకుర్తి 13.8, పామూరు 12.8, సంతనూతలపాడు 11.4,..

    • పీసీపల్లి 11.1, జరుగుమల్లి 10.7, మద్దిపాడు 10.6 వర్షపాతం

  • Oct 29, 2025 09:59 IST

  • Oct 29, 2025 09:52 IST

    articleText

  • Oct 29, 2025 09:47 IST

    జిల్లాపై మొంథా తుపాను ఎఫెక్ట్..

    • భారీ వర్షాలు బలమైన ఈదురుగాలులతో స్తంభించిన జన జీవనం.

    • జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పొంగిన వాగులు, వంకలు..

    • రహదారులు జలమయమై నిలిచిపోయిన రాకపోకలు..

    • కొన్నిచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం..

    • పొలాల్లోకి వరదనీరు చేరి పొగాకు, కంది, శనగ పంటలకు ముంపు..

    • మార్కాపురం ప్రాంతంలో పొంగి ప్రవహించిన గుండ్లకమ్మ వాగు.. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం..

    • గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న 6 వేల క్యూసెక్కుల వరద నీరు.

    • నాలుగు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న అధికారులు.

    • జిల్లాలో పాలేరు, ముసి, సగిలేరుతో పాటు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు..

    • కంభం చెరువుతో పాటు అన్ని చెరువుల్లోకి భారీగా నీరు.

    • దోర్నాల వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న దొంగల వాగు.

    • కర్నూలు - గుంటూరు రహదారిలో నిలిచిపోయిన రాకపోకలు.

  • Oct 29, 2025 09:46 IST

    కాకినాడ: అల్లకల్లోలంగా ఉప్పాడ తీరం

    • ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు

    • కాకినాడ: పల్లిపేట దగ్గర కోతకు గురైన రోడ్డు

    • సుబ్బంపేట-నేమం మధ్యలో బీచ్‌ రోడ్డుపైకి ఎగసిసడుతున్న అలలు

  • Oct 29, 2025 09:45 IST

    కృష్ణా: మచిలీపట్నంలో పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు

    • మచిలీపట్నంలో నిన్నటినుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం

  • Oct 29, 2025 09:44 IST

    కడప జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

    • రాజుపాలెం, దువ్వూరు మండలాల్లో పంట పొలాల్లోకి నీరు

  • Oct 29, 2025 08:45 IST

    24గంటల్లో భారీ వర్షాలు..

  • Oct 29, 2025 08:45 IST

    విజయనగరం: మెంటాడలో వర్ష బీభత్సం

    • కేజీబీవీ బాలికల పాఠశాలలోకి భారీగా వరద నీరు

    • జడ్పీ హైస్కూల్‌కు 208 మంది విద్యార్థినుల తరలింపు

  • Oct 29, 2025 08:22 IST

    మొంథా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు

    • ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వర్షం

    • ఖమ్మం జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు

    • పాలేరు జలాశయానికి కొనసాగుతోన్న వరద, 23 గేట్లు ఎత్తివేత

  • Oct 29, 2025 08:21 IST

    నెల్లూరు: ఏఎస్ పేట మండలంలో పొంగుతున్న వాగులు

    • నక్కలవాగు వంతెనపై వరద నీటి ప్రవాహం

    • ఏఎస్ పేట-నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం

    • తెల్లపాడు వాగు ఉధృతి, ఏఎస్ పేట-ఆత్మకూరు మధ్య రాకపోకలకు అంతరాయం

    • నెల్లూరు జిల్లాలో ఈరోజు కూడా విద్యాసంస్థలు బంద్

  • Oct 29, 2025 08:21 IST

    తుఫాన్ ప్రభావంతో గుంటూరులో నేలకొరిగిన చెట్లు

    • రాత్రికి రాత్రే చెట్ల కొమ్మలు తొలగించిన జీఎంసీ సిబ్బంది

  • Oct 29, 2025 08:21 IST

    ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం

    • ఒంగోలులోని ప్రధాన రహదారులన్నీ జలమయం

    • 3వేల కుటుంబాలను 60 పునరావాస కేంద్రాలకు తరలింపు

    • ప్రకాశం జిల్లా మార్కాపురంలో రోడ్లు, వంతెనలపై వరద ప్రవాహం

    • మార్కాపురం మండలం జోడిచెర్ల దగ్గర గుండ్లకమ్మవాగు ఉధృతి

  • Oct 29, 2025 08:20 IST

    మొంథా ప్రభావంతో ఉప్పాడ తీరంలో ఎగిసిపడిన అలలు

    • పల్లిపేట దగ్గర కోతకు గురైన రహదారి

    • సుబ్బంపేట-నేమం మధ్యలో బీచ్‌రోడ్డు దాటి ఎగిసిపడిన అలలు

    • కొమరగిరి జగనన్న లేఅవుట్‌లోకి చేరిన సముద్రపు నీరు

  • Oct 29, 2025 08:19 IST

    మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

    • తుఫాన్ ప్రభావంతో పెరిగిన గాలుల తీవ్రత

    • అల్లకల్లోలంగా సముద్రం, తీరంలో ఎగసిపడుతున్న అలలు

    • తుఫాన్ ప్రభావంతో భారీగా ఈదురుగాలులు

    • ఈదురుగాలులకు విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు

    • రాకపోకలకు అంతరాయం, ఇబ్బందులు పడుతున్న ప్రజలు

    • అనేక గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా

    • తీర ప్రాంతాల్లో పలు చోట్ల కోతకు గురైన రహదారులు

  • Oct 29, 2025 08:18 IST

    తుఫాన్‌గా బలహీనపడుతున్న మొంథా

    • 6గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం

    • ఏపీ, తెలంగాణ, ఒడిషా, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో వర్షాలు

    • ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా పయనిస్తున్న మొంథా

    • మధ్యాహ్నానికి ఛత్తీస్‌గఢ్ దగ్గర బలహీనపడనున్న మొంథా

    • ఏపీలోని 12 జిల్లాలకు భారీ వర్ష సూచన

    • 9 జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన

  • Oct 29, 2025 08:18 IST

    తీరం దాటిన 'మొంథా' తీవ్ర తుఫాన్‌

    • నరసాపురం దగ్గర తీరం దాటినట్టు ఐఎండీ ప్రకటన

    • అర్ధరాత్రి 11:30-12:30 మధ్య తీరందాటిన తీవ్ర తుఫాన్

    • ఏపీ, తెలంగాణ, ఒడిషా, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో వర్షాలు

    • ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా పయనిస్తున్న మొంథా

    • మధ్యాహ్నానికి ఛత్తీస్‌గఢ్ దగ్గర బలహీనపడనున్న మొంథా

    • కోస్తాంధ్ర, తెలంగాణలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్

  • Oct 29, 2025 08:17 IST

    ఉత్తర వాయువ్య తెలంగాణ మీదుగా పయనిస్తున్న మొంథా

    • ఇవాళ మధ్యాహ్నాం ఛత్తీస్‌గఢ్‌ దగ్గర బలహీనపడనున్న మొంథా

    • మొంథా తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు

    • ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

    • ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో వర్షాలు

    • హైదరాబాద్‌లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం

  • Oct 29, 2025 08:16 IST

    కోనసీమ జిల్లాలో ఉప్పొంగిన సముద్రం

    • అంతర్వేది దగ్గర ముందుకొచ్చిన సముద్రం

    • మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలింపు

  • Oct 29, 2025 08:15 IST

    ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్‌, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

  • Oct 29, 2025 08:14 IST

    నరసాపూర్‌ సమీపంలో తీరం దాటిన మొంథా తుఫాన్‌

  • Oct 29, 2025 08:14 IST

    మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు

    • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, తూ.గో, ప.గో,..

    • ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు

  • Oct 29, 2025 08:14 IST

    ఏపీలో విధ్వంసం సృష్టించిన మొంథా తీవ్ర తుఫాన్‌

    • తుఫాన్‌ ప్రభావంతో విశాఖ- కిరండూల్‌ సింగిల్‌ రైల్వేలైన్‌ ధ్వంసం

    • అరకు రైల్వే టన్నెల్‌ నెంబర్‌ 32ఏ దగ్గర రైల్వేట్రాక్‌ ధ్వంసం

    • చిమిడిపల్లి-బొర్రాగుహలు రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్‌ ధ్వంసం

  • Oct 29, 2025 08:14 IST

    తుఫాన్‌తో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వ సాయం

    • ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశం

  • Oct 29, 2025 08:11 IST

    తుఫాన్‌ తీరం దాటడానికి మరో 2 గంటల సమయం

    • మచిలీపట్నంకు 50 కి.మీ, కాకినాడకు 100 కి.మీ,..

    • విశాఖకు 240 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం

    • గంటకు 15 కి.మీ వేగంతో కదులుతున్న తుఫాన్‌

    • తీరంవెంబడి 90-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు

    • తుఫాన్‌ తీరం దాటిన తర్వాత 6 గంటల పాటు ప్రభావం

    • మత్స్యకారులు రెండు రోజులు వేటకు వెళ్లొద్దు

    • కాకినాడ పోర్టులో 10వ నెంబర్‌ హెచ్చరిక కొనసాగింపు

  • Oct 29, 2025 07:12 IST

  • Oct 29, 2025 07:12 IST

    ఉమ్మడి కర్నూలు జిల్లా అంతటా తుఫాను ప్రభావం

    • పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు

    • మిరప కంది వరి పంటలపై ప్రభావం

    • 2 వేల ఎకరాల్లో నేలవాలిన వరిపంట

    • ఆందోళనలో రైతులు

    • అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.

  • Oct 29, 2025 06:51 IST

    అంతర్వేదిపాలెం దగ్గర తీరాన్ని తాకిన మొంథా తుఫాన్‌

    • తీర ప్రాంత జిల్లాల్లో భారీగా ఈదురుగాలులు, వర్షం

    • 22 జిల్లాల్లోని 403 మండలాలపై మొంథా తుఫాన్‌ ప్రభావం

    • 1,204 పునరావాస కేంద్రాల్లో 75,802 మంది తరలింపు

  • Oct 29, 2025 06:49 IST

    మొంథా తుఫాన్‌ ప్రభావంతో మచిలీపట్నంలో భారీగా ఈదురుగాలులు

    • మచిలీపట్నంలో గంటకు 82 కి.మీ వేగంతో గాలులు

    • మొంథా తుఫాన్‌ ప్రభావంతో అల్లకల్లోలంగా సముద్రం

    • తీరంలో భారీగా ఎగిసిపడుతున్న అలలు

    • పలుచోట్ల విరిగిపడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

    • అనేక గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

  • Oct 29, 2025 06:49 IST

    మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

    • పలుచోట్ల 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు

    • కావలిలో అత్యధికంగా 22 సెం.మీ, సింగరాయకొండలో 18.7,..

    • దగదర్తిలో 18.2, ఉలవపాడులో 17, కందుకూరులో 16.8 సెం.మీ,..

    • కొడవలూరులో 15.2, కలిగిరిలో 14.4 సెం.మీ వర్షపాతం

    • సంతనూతలపాడులో 14, లింగసముద్రంలో 13.7, ఒంగోలులో 12.7 సెం.మీ,..

    • నెల్లూరులో 11, విశాఖలో 10.8, చీరాలలో 10.2, నర్సాపురంలో 10 సెం.మీ,..

    • కాకినాడ 6.4 సెం.మీ వర్షపాతం నమోదు