MP R Krishnaiah Bandh: తెలంగాణ బంద్.. కిషన్ రెడ్డిని కలిసిన ఆర్.కృష్ణయ్య
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:35 PM
అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్ నిర్వహించనున్నట్లు ఆర్. కృష్ణయ్య చెప్పారు. అందరూ కలిసి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇందుకు నిరసనగా బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య (MP R Krishnaiah) ఈనెల 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అందులో భాగంగా తెలంగాణ బంద్‌కు బీజేపీ మద్దతు కోరారు ఎంపీ. ఇదే విషయంపై ఈరోజు (శనివారం) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో (Union Minister Kishan Reddy) ఆర్.కృష్ణయ్య భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ.. ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని తెలిపారు.
అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అందరూ కలిసి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరడం జరిగిందని తెలిపారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీసీ సంఘాలు ఇప్పటికే పెద్దఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం, నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని ఎంపీ ఆర్.కృష్ణయ్య వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
బనకచర్ల వివాదం.. రేవంత్‌కు హరీష్ సూటి ప్రశ్న
కేటీఆర్ టెలికాన్ఫరెన్స్.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్
Read Latest Telangana News And Telugu News